Gold News: డబ్బు కంటే బంగారం రూపంలో పెట్టుబడులను చేసేందుకు భారతీయులు ఎక్కువగా ఆసక్తిగా చూపుతుంటారు. వారి ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాన్ని ప్రవేశపెట్టింది.
తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి తొలి విడత సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను(SGB) కేంద్రం లాంచ్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రెండు విడతల గోల్డ్ బాండ్లను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిరీస్-1 జూన్ 19, 2023 నుంచి జూన్ 23, 2023 వరకు అందుబాటులో ఉంచింది. అలాగే సిరీస్-2 సెప్టెంబర్ 11-15 మధ్య జారీ చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.

SGB పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ప్రారంభించింది. దీని ద్వారా పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి డిజిటల్ రూపంలో వెసులుబాటు కల్పించింది. ఫిజికల్ బంగారం దిగుమతులను తగ్గించటానికి ఇది కొంత మేరకు దోహదపడుతోంది. ఈ గోల్డ్ బాండ్లను దేశంలోని నివాసితులు, HUFలు, ట్రస్ట్‌లు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు విక్రయించడానికి పరిమితం చేయబడ్డాయి.
ఈ పథకం కింద 4 నుంచి 20 కేజీల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పరిమితులు ఉన్నాయి. ఒక్కసారి వీటిని కొనుగోలు చేసిన తర్వాత 8 ఏళ్లు లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. అయితే 5వ సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత పెట్టుబడిదారులు బాండ్లను అప్పటి ధరలకు అనుగుణంగా రిడీమ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. దీనిపై సంపాదిందే లాభాలు ఆదాయపు పన్ను చట్ట ప్రకారం పన్ను రేట్లు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications