RBI KYC: బ్యాంక్ కస్టమర్లకు ఊరట.. అందుకోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు..!!
KYC Update: బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చే వార్తొకటి వైరల్ గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అప్ డేట్ తో దేశంలోని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.

రిజర్వు బ్యాంక్ ప్రకటన..
బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కేవైసీని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని రీ కేవైసీ అని పిలుస్తారు. అయితే దీనిని పూర్తి చేయటానికి గతంలో వ్యక్తిగతంగా కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సి ఉండేది. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం నాన్-ఫేస్ టూ ఫేస్ ఛానెల్‌ల ద్వారా కస్టమర్లు స్వీయ-డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని RBI స్పష్టం చేసింది.

బ్యాంకుకు వెళ్లకుండా మార్గాలు..
రీ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఎవరైనా కస్టమర్ నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లకుండా.. రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, సదరు బ్యాంక్ ATMలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాలను వినియోగించుకోవచ్చు. ఇది కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉంటుందని RBI నుంచి విడుదలైన ఒక పత్రికా ప్రకటన తెలిపింది. దీంతో కస్టమర్లు తిరిగి KYC ప్రక్రియ కోసం బ్యాంక్ బ్రాంచ్‌లను సందర్శించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది వారికి పెద్ద ఉపశమనాన్ని అందిస్తుంది.

అడ్రస్ మారితే..
ఎవరైనా బ్యాంక్ కస్టమర్ తన చిరునామాను మార్చుకోవాల్సి వస్తే.. పైన తెలిపిన ఏ మార్గంలోనేనా ఆ వివరాలను బ్యాంక్ వద్ద అప్ డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండు నెలల్లోగా డిక్లేర్డ్ అడ్రస్‌ని బ్యాంక్ వెరిఫికేషన్ చేస్తుంది. బ్యాంకులు తమ కస్టమర్ల డేటాను అప్ డేటెడ్ గా ఉంచుకునేందుకు కేవైసీ ప్రక్రియను చేపట్టాలని రిజర్వు బ్యాంక్ గతంలో దేశంలోని అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం చెల్లుబాటయ్యే పత్రాలను కస్టమర్లు బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.

అవసరమైన పత్రాలు..
రిజర్వు బ్యాంక్ వెల్లడించిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలు ఏమిటంటే.. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, NREGA ద్వారా జారీ చేయబడిన జాబ్ కార్డ్, జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖను బ్యాంకులు కస్టమర్ల నుంచి అంగీకరిస్తాయి. రీ-కేవైసీని వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్(V-CIP) ద్వారా రిమోట్‌గా చేయవచ్చని RBI తెలిపింది.


Click it and Unblock the Notifications