లోన్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ విషయం. అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఇంట్లో ఉన్న బంగరాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు చాలామంది. అయితే వెండిపై ఇలా లోన్స్ తీసుకునే సదుపాయం లేదు. కానీ, ఇప్పుడు RBI ఇప్పుడు కొత్త రూల్ తీసుకురాబోతోంది. ఇకపై వెండి ఆభరణాలను కూడా తాకట్టు పెట్టి రుణం పొందొచ్చు. దీని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామాన్య ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతోంది. ఇకపై వెండి ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చని నిర్ణయించింది. ఈ కొత్త రూల్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలవుతుంది. ఈ కొత్త రూల్ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి కొంత మేలు చేకూరే అవకాశం ఉంది. చాలామంది ఇళ్లలో వెండి వస్తువులు, నగలు వంటివి ఉంటాయి. బంగారం కొనలేని వాళ్లు తర్వాతి ఆప్షన్ గా వెండినే కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రూల్స్ ఇవే..
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒక కస్టమర్ గరిష్టంగా 10 కిలోల వెండిని తాకట్టు కింద పెట్టొచ్చు. ఒకవేళ వెండి ఆభరణాలు అయితే గరిష్టంగా 500 గ్రాముల వరకూ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు .ఈ లిమిట్ కంటే ఎక్కువ మొత్తాన్ని తాకట్టు పెట్టడానికి అనుమతించరు. కస్టమర్లు అన్ని ప్రభుత్వ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్(NBFC)లో ఈ తరహా లోన్స్ తీసుకోవచ్చు. బంగారం లాగానే వెండిని కూడా బరువు, మార్కెట్ వాల్యూ ఆధారంగా వెల కడతారు. దానికి తగినట్టుగా లోన్ అమౌంట్ నిర్ణయిస్తారు.
బంగారం లాగానే..
బంగారం విషయంలో ఎలా అయితే ట్రాన్స్‌పరెన్సీ ఉంటుందో.. వెండిలో కూడా అదే విధంగా కస్టమర్లకు అన్ని వివరాలు తెలియజేస్తారు. వెండిని ఎలా అంచనా వేస్తున్నారు? ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు అనే విషయాలు బ్యాంకులు కస్టమర్‌కు తెలియజేస్తాయి. ఈ పథకం చిన్న కుటుంబాలు, రైతులు, గ్రామీణ కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
లోన్ రీపేమెంట్
వెండి తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ ని ఏడు సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి. వడ్డీ రేట్లు బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఈ రేట్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుండొచ్చు. కస్టమర్ సమయానికి లోన్ చెల్లించకపోతే బంగారం తరహాలోనే బ్యాంక్ లు తాకట్టు పెట్టిన వెండిని వేలం వేస్తాయి. వెండి తాకట్టు విధానం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి వస్తుంది. బంగారంతో పాటు వెండికి కూడా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

Interest rates: రేపే RBI పాలసీ నిర్ణయం! లోన్ EMI పెరుగుతుందా? వడ్డీ రేట్లపై క్లారిటీ ఇదే!

GR RBI MPC Poll: ఏప్రిల్‌లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications