RBI: ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ రోజురోజుకూ పడిపోతోంది. ఈ క్రమంలో ఎవరినైనా నమ్మి అప్పు ఇచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ క్రమంలో బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ కావాలనుకునే వారికి మంచి సౌకర్యాన్ని రిజర్వు బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్లోటింగ్ రేటింగ్ బాండ్స్ గురించే. దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్లు సైతం వీటిని నేరుగా ఇకపై రిజర్వు బ్యాంక్ నుంచి కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పించబడింది. ఇందుకోసం రిటైల్ ఇన్వెస్టర్లు RBI రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. RBI-రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను నవంబర్ 12, 2021న ప్రధాన మంత్రి ప్రారంభించారు.

ఈ స్కీమ్ వ్యక్తిగత లేదా రిటైల్ పెట్టుబడిదారులు ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రిటైల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతాను తెరవడానికి అనుమతించబడతారు. దీని ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు చేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయటం సులభతరం చేయటం లక్ష్యంగా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ప్రవేశపెట్టబడింది.
ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ వడ్డీ ఆదాయాన్ని అందిస్తాయి. వీటిని ట్రేడింగ్ చేసేందుకు వినియోగించటానికి కుదరదు. వీటిని కేంద్ర ప్రభుత్వం స్వయంగా జారీ చేస్తుంది కాబట్టి ఎలాంటి భయం అక్కర్లేదు. వీటిని జారీ చేసిన తేదీ నుంచి ఏడేళ్ల గడువు ముగిసిన తర్వాత తిరిగి చెల్లించబడతాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను వర్తిస్తుంది.
గతంలో రిటైల్ ఇన్వెస్టర్లు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించబడ్డారు.


Click it and Unblock the Notifications