డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. UPI ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానం చేయడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)కి ఆదేశాలు జారీ చేయనుంది. ఇందులో భాగంగా మొదట రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానం చేయనున్నారు. ఇప్పటి వరకు యూపీఏ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక నుండి క్రెడిట్ కార్డ్స్‌ను కూడా అనుసంధానించుకోవచ్చు.
దీని వల్ల వినియోగదారులకు ఎంతో ప్రయోజనం. యూపీఏ ప్లాట్‌ఫామ్స్‌కు క్రెడిట్ కార్డును అనుసంధానించడం వల్ల కార్డును స్వైప్ చేయకుండానే చెల్లింపులు జరపవచ్చు. కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చు. అయితే రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయాలి.

జీపే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ ఆధారిత యాప్స్‌ను ఎంపిక చేసిన బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఆర్బీఐ తాజా ప్రకటనతో వ్యక్తిగత ట్రాన్సాక్షన్స్‌కు కూడా వర్తిస్తుంది.
యాప్స్ ద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు చెల్లింపులు జరపడానికి మొదట యూపీఐ యాప్‌కు యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకు జీపే వెబ్ సైట్ ప్రకారం ఇండివిడ్యువల్స్ ఈ కింది బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డ్స్ (వీసా లేదా మాస్టర్ కార్డ్) ద్వారా చెల్లింపులు జరపవచ్చు. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్, ఫెడరల్, ఆర్బీఎల్, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ ఉన్నాయి.
కార్డును యాడ్ చేసుకోవడానికి మొదట యాప్‌ను ఓపెన్ చేయాలి. ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి.
పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయాలి. ఈ యాప్‌లో యాడ్ అయిన కరెంట్ బ్యాంకు అకౌంట్స్ కనిపిస్తాయి.
యాడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన క్లిక్ చేయాలి.
అక్కడ కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు, బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సేవ్ పైన క్లిక్ చేయాలి.
ఇష్యూయర్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను అంగీకరించవలసి ఉంటుంది.
ఆ తర్వాత యాక్టివేట్ పైన క్లిక్ చేయాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications