e-rupee: దేశంలోని యూపీఐ చెల్లింపుల సేవలను అందిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, క్రెడ్, మెుబిక్విక్ వంటి సంస్థలు రిజర్వు బ్యాంక్ సరికొత్త ప్రాజెక్ట్ డిజిటల్ రూపీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు తమ కస్టమర్లకు అవకాశం కల్పించేందుకు వీలుగా భాగస్వాములు కావాలని చూస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఆర్బీఐ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి.
గతంలో ప్రాథమికంగా భారతీయ రిజర్వు బ్యాంక్ కేవలం భారతీయ బ్యాంకులను మాత్రమే ఈ-రూపీ సేవలను అందించేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇండియన్ కరెన్సీ రూపీని సదరు బ్యాంకులు తమ డిజిటల్ యాప్స్ ద్వారా వినియోగదారులకు అందించేందుకు అవకాశం కల్పించబడింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పైలట్ ప్రాజెక్టులో పాల్గొనేందుకు అవకాశాన్ని ప్రైవేటు నాన్ బ్యాంకింగ్ పేమెంట్ చెల్లింపు ఆటగాళ్లకు సైతం ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

వాస్తవానికి రిజర్వు బ్యాంక్ డిసెంబర్ 2022లో ఈ-రూపీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు భారతీయ పౌరులకు సంబంధించిన చెల్లింపు వివరాలు కొంత వరకు గోప్యంగా ఉంచబడతాయని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. అయితే తర్వాతి కాలంలో దీని వినియోగం భారీగా తగ్గిపోయింది. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా అంగీకారాన్ని పొందకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఈ-రూపీ వినియోగాన్ని పెంచేందుకు ఆర్బీఐ Google Pay, Amazon Pay వంటి ప్రముఖ చెల్లింపు యాప్‌లు ఈ-రూపాయి లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
అయితే డిజిటల్ కరెన్సీని పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి తక్షణ ప్రణాళికలను కలిగి లేదు. స్కేలబిలిటీ, స్వీకరణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి వారు పని చేస్తున్నందున ఈ-రూపాయి పైలట్ కనీసం రాబోయే రెండేళ్లపాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
అనేక కరెన్సీలు వాటిని జారీ చేయడానికి మరియు అమలు చేయడానికి ఉత్తమమైన మార్గాన్ని కనుగొనడానికి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. ఉదాహరణకు చైనా తన వినియోగాన్ని పెంచుకోవడానికి డిజిటల్ యువాన్ ద్వారా కొంత చెల్లింపును అనుమతించింది. తూర్పు ఆసియా దేశమైన తైవాన్ కూడా తన స్వంత CBDCని ప్రారంభించే పనిలో ఉంది. ఆఫ్రికన్ దేశమైన రువాండా వచ్చే రెండేళ్లలో తన ఈ-కరెన్సీని ప్రారంభించాలని యోచిస్తోంది.
e-rupee అంటే ఏంటి, ఉపయోగాలేంటి..?
రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన ఈ-రూపాయి డిజిటల్ చెల్లింపులు వేగంగా, సులభంగా ఉంటాయి. వీటికి మధ్యవర్తి లేదా బ్యాంక్ ఖాతా అవసరం లేదు. మీరు సులభంగా QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు లేదా చెల్లింపులు చేయడానికి లేదా స్వీకరించడానికి SMS స్ట్రింగ్‌ను ఇన్‌పుట్ చేయవచ్చు. ఇవి ఎటువంటి లావాదేవీ రుసుములు లేదా ఛార్జీలను కలిగి ఉండవు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications