Digital Payments: దేశంలో డబ్బు వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి డిజిటల్ చెల్లింపులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దీనికి రిజర్వు బ్యాంక్ సహకారం కూడా దక్కుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు పెద్ద ఊరటను అందించే వార్త వెలుగులోకి వచ్చింది.
దేశంలోని ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకునే వారికి రిజర్వు బ్యాంక్ పెద్ద శుభవార్తను చెప్పింది. రానున్న కాలంలో రైళ్లు, బస్సులు, టోల్ చెల్లింపులు, పార్కింగ్ వంటి చెల్లింపులను సులభరం చేసేందుకు నూతన పద్ధతులను దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దేశంలోని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు వివిధ ప్రజా రవాణా వ్యవస్థలకు చెల్లింపు కోసం ప్రీపెయిడ్ సాధనాలను(PPI) జారీ చేయడానికి అనుమతించబడ్డాయి. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

రిజర్వు బ్యాంక్ తాజా చొరవ కారణంగా రానున్న కాలంలో ప్రయాణికులకు ప్రజా రవాణా వ్యవస్థల్లో డబ్బుతో పాటు ఇతర చెల్లింపు వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రీపెయిడ్ సాధనాలను, ప్రీపెయిడ్ వాలెట్లలతో పాటు కార్డుల వినియోగం ద్వారా చెల్లింపుల జరపనున్నారు.
మెరుగైన, వేగవంతమైన డిజిటలైజ్ చేయబడిన ఆర్థిక సేవలను అందించడానికి, ప్రజా రవాణా వ్యవస్థకు చెల్లింపు చేయగల PPIని జారీ చేయడానికి ఆమోదం లభించిందని నోటిఫికేషన్‌లో చెప్పబడింది. RBI నుంచి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు PPIలను జారీ చేస్తాయి. ప్రస్తుతం మన దేశంలో సెమీ క్లోజ్డ్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ మూడు రకాల PPIలు అందుబాటులో ఉన్నాయి.
PPI ఎలా సహాయం చేస్తుంది:
1. బ్యాంకులు/NBFCలు రిజర్వు బ్యాంక్ ఆమోదం పొందిన తర్వాత PPIని జారీ చేస్తాయి.
2. PPI ట్రాన్సిట్ సర్వీస్, టోల్, పార్కింగ్‌కు సంబంధించిన ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ అప్లికేషన్‌ను కలిగి ఉంటుంది.
3. PPIతో మీరు మెట్రో, బస్సు, రైలు, జలమార్గాలు, టోల్ అండ్ పార్కింగ్ వంటి ప్రజా రవాణా కోసం ఛార్జీలు చెల్లించగలరు.
4. కేవైసీ ధృవీకరణ లేకుండా PPIలను జారీ చేయవచ్చు.
5. దీని తర్వాత డబ్బును PPIలో డిపాజిట్ చేయవచ్చు.
6. PPIలో బకాయి ఉన్న మొత్తం ఎప్పుడైనా రూ.3,000కు మించదు.
7. PPI శాశ్వత చెల్లుబాటును కలిగి ఉంటుంది. PPIలో నగదు ఉపసంహరణ, వాపసు లేదా నిధుల బదిలీ అనుమతించబడదు.


Click it and Unblock the Notifications