Post Offices: దేశంలో పెద్ద నోట్లను చలామణి నుంచి తొలగించటం ద్వారా నల్లధనం, అక్రమాలను అరికట్టవచ్చని మోదీ సర్కార్ భావించింది. ఇందులో భాగంగానే రూ.500, రూ.1000 నోట్లు గతంలో వెనక్కి తీసుకోబడ్డాయి.
అయితే ఆ తర్వాత మార్కెట్లోకి ప్రవేశపెట్టబడిన రూ.2000 నోట్లను తాత్కాలికంగా కొనసాగించి క్లీన్ నోట్ పాలసీ కింద వెనక్కి తీసుకుంటున్నట్లు అకస్మాత్తు ప్రకటన చేశారు. దీనికి ముందు చాలా కాలంగా రిజర్వు బ్యాంక్ వ్యూహాత్మకంగా ఇతర డినామినేషన్ నోట్లను సర్క్యులేషన్ లోకి తీసుకొస్తు కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఆ తర్వాత సరైన సమయం రావటంతో గత ఏడాది రిజర్వు బ్యాంక్ పింక్ నోట్లను వెనక్కి తీసుకుంది.

నోట్లను కలిగి ఉన్న ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాల్లో జమచేసుకుని మార్చుకోవచ్చని గడువు సైతం గత ఏడాది ఇచ్చింది. అయితే గడువు తర్వాత నోట్లను కలిగి ఉన్నవారు వాటిని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని సూచించింది. దీంతో కొన్ని చోట్ల రిజర్వు బ్యాంక్ కార్యాలయాల వద్ద పెద్ద క్యూలైన్లు సైతం ప్రత్యక్షం అయ్యాయి. ఇందుకోసం 19 ఆర్బీఐ కార్యాలయ శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి 2000 రూపాయల నోట్లను కొనుగోలు చేశారు.
ఇప్పటి వరకు మెుత్తం జారీ చేసిన 2000 నోట్లలో 98 శాతం వెనక్కి వచ్చాయని ఇంకా ప్రజల వద్ద రూ.9,300 కోట్లు విలువైన నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసి వారి బ్యాంకు ఖాతాలో క్రెడిట్ పొందవచ్చని కూడా ప్రకటించించటం పెద్ద ఊరటను అందిస్తోంది. అయితే కొన్ని పోస్టాఫీసుల్లో ఈ నోట్ల మార్పిడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు వాపోయారు.
దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోస్టాఫీసుల్లో ఇప్పుడు 2000 రూపాయల నోట్లను స్వీకరిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీని కోసం వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ఆ తర్వాత కరెన్సీ నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా RBI ఇష్యూ ఆఫీసులకు పంపించాలి. డబ్బు నేరుగా నోట్లు పంపినవారి బ్యాంక్ ఖాతాల్లోకి జమచేయబడతాయి. ఈ పద్దతిలో రూ.20,000 విలువైన నోట్లను ఏకకాలంలో మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. ఏదేమైనప్పటికీ 2000 నోట్లను ఇప్పటికీ చెలామణిలోనే రిజర్వు బ్యాంక్ కొనసాగిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications