rbi: కేవలం బిల్లుల చెల్లింపుల కోసమే అందుబాటులోకి వచ్చిన పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి పేమెంట్ అగ్రిగేటర్లు.. ఇతర రంగాలకూ విస్తరించాయి. వివిధ రకాల ఇతర సర్వీసులను వినియోగదారుల అరచేతిలోకి తీసుకువచ్చాయి. కొన్ని అగ్రిగేటర్లు రుణాలు ఇవ్వడానికి, తీసుకున్న అప్పులు తిరిగి చెల్లింపుల సేవలూ అందిస్తున్న తరుణంలో.. RBI నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిజిటల్ లెండింగ్ రూల్స్ తప్పనిసరి:
లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ గా(LSP) సేవలు అందిస్తున్న పేమెంట్ అగ్రిగేటర్లను (PA).. రుణాల తిరిగి చెల్లింపుల కోసం ఉపయోగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 14న అనుమతించింది. ఆయా PAలు తప్పనిసరిగా డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. FAQ సెక్షన్ లో ఈ విషయాన్ని RBI వెల్లడించింది.

ఆర్బీఐకి అప్పీలు:
ఇంతకు ముందు రుణాల తిరిగి చెల్లింపులు నేరుగా బ్యాంకుల నుంచి కస్టమర్ ఖాతాలకు వెళ్లేవి. ఈ తరహా లావాదేవీల్లో అగ్రిగేటర్ల అవసరం ఉండదు. దానితో పలువురు పేమెంట్ అగ్రిగేటర్లు RBIకి అప్పీలు చేశారు. వీటి విషయమై స్పందించిన కేంద్ర బ్యాంకు.. రుణాల చెల్లింపుల్లో ఇప్పుడు PAలనూ అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

సులభతర వ్యాపారానికి అగ్రిగేటర్లు:
వివిధ పద్ధతుల ద్వారా వినియోగదారుల నుంచి వ్యాపారులు చెల్లింపులను అంగీకరించడానికి ఈ పేమెంట్ అగ్రిగేటర్లు సహాయపడతాయి. ప్రతి సంస్థా తమ సొంత చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేసుకునే అవసరం లేకుండా, లావాదేవీలు జరపడాన్ని సులభతరం చేస్తాయి. వీటి విషయమై 2020లో RBI వివరణాత్మక మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. తమ సేవలు పొందుతున్న వ్యాపారుల జాబితాను, ఎస్క్రో ఖాతాను ఎక్కడ నిర్వహిస్తున్నారనే వివరాలను PAలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలనే నిబంధన విధించింది.

లైసెన్సింగ్ డెడ్ లైన్:
ప్రసుత్త పేమెంట్ అగ్రిగేటర్లు పూర్తిస్థాయిలో పేమెంట్స్ సెటిల్ చేసే విధంగా అప్ గ్రేడ్ కావడానికి గతంలో మార్చి 2020 వరకు RBI సమయం ఇచ్చింది. కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును సెప్టెంబరు 2022 వరకు పొడిగించింది. అయితే మార్చి 2023 నుంచి పేమెంట్ అగ్రిగేటర్ల నికర విలువ రూ.25 కోట్లు తగ్గకుండా కొనసాగించాలని తన మార్గదర్శకాల్లో RBI పేర్కొంది.


Click it and Unblock the Notifications