RBI News: రిటైల్ పెట్టుబడిదారులకు RBI అప్‌డేట్.. గవర్నమెంట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈజీ వే!
RBI News: గతంతో పోలిస్తే ఆర్థిక క్రమశిక్షణపై ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతన్నారు. వారు ఇన్వెస్ట్ చేసేందుకు ఇప్పుడు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ కెపాసిటీ ఆధారంగా ఈక్వీటీస్, బాండ్స్, ప్రభుత్వ పథకాలు సహా సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే డైరెక్టుగా RBI ప్లాట్ ఫారమ్ లో కూడా ఈ పని చేయొచ్చని మీకు తెలుసా..?
వ్యక్తిగత ఇన్వెస్టర్లు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020(ట్యాక్సబుల్)కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను నవంబర్ 12, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించారు.

ఈ పథకం కింద వ్యక్తిగత పెట్టుబడిదారులు ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రిటైల్ డైరెక్ట్ గిల్ట్ ఖాతాను తెరవవచ్చు. తద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ దీన్ని ప్రేవేశపెట్టింది.
రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా అందించే సేవలను విస్తరించేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంతో సంప్రదించి ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020(ట్యాక్సబుల్) - FRSB 2020(T) సబ్‌స్క్రిప్షన్ కు ఇక్కడ అవకాశం కల్పించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి వడ్డీతో కూడిన నాన్-ట్రేడబుల్ బాండ్లు. కేంద్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తుండగా.. ఏడేళ్ల గడువు ముగిసిన తర్వాత తిరిగి చెల్లించబడతాయి.


Click it and Unblock the Notifications