Gold News: హద్దూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వ్యక్తులే కాకుండా దేశాలకు దేశాలు సైతం భారీ స్థాయిలో బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన దేశం ఎంత పసిడిని వెనకేసిందే తెలుసా..?
డిసెంబర్ 2023 చివరి నాటికి విదేశీ మారక నిల్వల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 803.6 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇదికాస్తా ఏప్రిల్ 26, 2024 నాటికి 827.69 టన్నులకు పెరిగింది. అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కేవలం 4 నెలల వ్యవధిలోనే 24 టన్నుల బంగారాన్ని సమకూర్చుకున్నట్లు RBI తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2023 సంవత్సరం మొత్తంలో వెనకేసిన 16 టన్నుల కంటే ఇది దాదాపు 1.5 రెట్లు ఎక్కువ.

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన భౌగోళిక, రాజకీయ ఒత్తిళ్లు, సవాళ్ల నేపథ్యంలో బంగారాన్ని ఓ స్థిరమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. అందుకే యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారులు విజృంభించిన అస్థిర పరిస్థితుల్లో స్వర్ణాన్ని సమకూర్చుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు వ్యూహాత్మక డైవర్సిఫికేషన్‌లో ఇదొక భాగంగా పరిగణించబడుతుంది.
అత్యంత ఎక్కువగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ, పసుపు లోహం నిల్వలను పెంచుకోవడంలో మాత్రం RBI వెనకబడి ఉంది. 1991లో విదేశీ మారక ద్రవ్యం సంక్షోభ సమయంలో బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని తాకట్టుపెట్టినప్పుడు విమర్శలను మూటగట్టుకుంది. ఆ మొత్తాన్ని తిరిగి తెచ్చుకున్న అనంతరం 2017 ఏడాది చివరి నుంచి కొత్తగా స్టాక్ జోడించడం మొదలుపెట్టింది. 2022 నుంచి బహిరంగ మార్కెట్లో స్వర్ణం కొనుగోలు చేయడం ప్రారంభించింది.
గతేడాది చివరి నాటికి మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలలో బంగారం వాటా 7.75 శాతంగా ఉంది. ఏప్రిల్ 2024 ముగిసే సమయానికి దాదాపు 8.7 శాతానికి పెరిగింది. 2024 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 290 టన్నులు జోడించి ప్రపంచ బంగారం డిమాండ్‌లో నాలుగింట ఒకవంతు వాటాను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగానూ పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకునే పనిలో ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications