Raymond News: దేశంలోని ప్రముఖ వ్యాపార సమూహాల్లో రేమాండ్ గ్రూప్ ఒకటి. దీనిని గౌతమ్ సింఘానియా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన జీవితంలోని వ్యక్తిగత విషయాలు కంపెనీ షేర్లపై భారీ ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడాకుల వివాదంలో ఉన్నారు. అయితే తన వ్యక్తిగత జీవితానికి వ్యాపారాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కంపెనీ ఎండీ, ఛైర్మన్ కరోనా మహమ్మారి నుంచి వ్యాపారం బాగా ఉందని, అభివృద్ధి చెందుతుందన్నారు. తాను వ్యాపారంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు సింఘానియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే తన అధికారాలను ఉపయోగించి కంపెనీ బోర్డు నుంచి భర్త తనను తొలగించారని నవాజ్ మోదీ సింఘానియా ఆరోపించిన సంగతి తెలిసిందే. బోర్డు నుంచి తొలగింపుపై చెల్లుబాటు కాని కారణాలను చూపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

రేమాండ్ గ్రూప్ కింద ఉన్న మూడు ప్రైవేట్ కంపెనీలైన JK ఇన్వెస్టర్స్, రేమండ్ కన్స్యూమర్ కేర్, స్మార్ట్ అడ్వైజరీ & ఫిన్‌సర్వ్ ఇప్పటికే తమ బోర్డుల నుంచి నవాజ్ మోడీని తొలగించాయి. లిస్టెడ్ కంపెనీ రేమండ్ లిమిటెడ్ ఆమె తొలగింపును ఇంకా ప్రతిపాదించనప్పటికీ.. సింఘానియా నిర్ణయంపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ ఆరోపించారు.
ఈ క్రమంలో రేమాండ్ శుక్రవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 18 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ ప్రకటించింది. దాని రియల్-ఎస్టేట్ విభాగానికి బలమైన డిమాండ్‌తో పుంజుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ2.29 బిలియన్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం 21% పెరిగింది. అలాగే జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చే ఐదేళ్ల కాలానికి కంపెనీ గౌతమ్ సింఘానియాను మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించింది.


Click it and Unblock the Notifications