Raymond News: గౌతమ్ సింఘానియాకు మరోసారి పట్టం కట్టిన రేమండ్.. విడాకుల వివాదం కొనసాగుతున్నా..
Gautam Singhania: ప్రపంచంలోనే అతిపెద్ద సూటింగ్ ఫ్యాబ్రిక్ ఉత్పత్తిదారుగా రేమండ్ కు మంచి ఆదరణ ఉంది. సంస్థను ఆ స్థాయిలో నిలపడానికి దాని మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్‌గా గౌతమ్ సింఘానియా ఎంతో కృషి చేశారు. అయితే ఇటీవల విడాకుల వివాదం ఆయనను చుట్టుముట్టింది. అదికాస్తా మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదంతో సతమతమవుతున్న గౌతమ్ సింఘానియాకు రేమండ్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. జూలై 1, 2024 నుంచి ఐదేళ్ల కాలానికి ఆయనను మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నియామకం కంపెనీ సభ్యుల ఆమోదానికి లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

'సింఘానియా నాయకత్వంలో గ్రూప్ అపారమైన పురోగతిని సాధించింది. రేమండ్ బ్రాండ్‌ను భారత్ నుంచి గ్లోబల్ మార్కెట్‌ల వరకు అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. కొత్త బ్రాండ్‌లను సృష్టించడంలో, నూతన ఉత్పత్తులను ప్రారంభించడంలోనూ చురుకైన ఆసక్తిని కనబరిచారు. గ్రూపును సుస్థిర వృద్ధి దిశగా విజయవంతంగా నడిపిస్తారనే నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్‌లో వ్యాపారంలో గ్రూప్ విశేషమైన ముందడుగు వేయడానికి ఆయనే కారణం' అని కంపెనీ పేర్కొంది.
JK ఇన్వెస్టర్స్ (బాంబే), రేమండ్ కన్స్యూమర్ కేర్ (RCCL)తో పాటు స్మార్ట్ అడ్వైజరీ మరియు ఫిన్‌సర్వ్ అనే 3 ప్రైవేట్ కంపెనీల బోర్డుల నుండి గౌతమ్ భార్య నవాజ్ మోడీ ఇటీవలే తొలగించబడ్డారు. దీని తర్వాత జరిగిన తాజా నియామకం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 2023లో విడాకుల ప్రకటన తర్వాత మొదలైన వివాదం కొనసాగుతూనే ఉండగా రేమండ్ నుంచి ఇప్పుడు తాజా అప్‌డేట్ వచ్చింది.


Click it and Unblock the Notifications