Nawaz Modi: భారతీయ బిలియనీర్ గౌతమ్ సింఘానియా, అతని భార్య నవాజ్ మోడీ సింఘానియా విడిపోతున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లైన 32 ఏళ్ల తర్వాత ఇలా జరిగింది.
బిలియనీర్ గౌతమ్ సింఘానియా భార్య విడాకుల విషయంలో పెద్ద షరతు పెట్టిందని ఓ నివేదిక చెబుతోంది. ఇందులో తనకు ఆస్తిలో 75 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. కుమార్తెలు నిహారిక, నిషా, తన కోసం ఇంత మెుత్తాన్ని డిమాండ్ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.

గౌతమ్ సింఘానియా తన రూ.11,620 కోట్ల విలువైన తన ఆస్తిలో 75 శాతం వాటాను తన కుమార్తెలు, భార్యకు ఇచ్చేందుకు తన సమ్మతిని వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది. ఈ మెుత్తాన్ని బదిలీ చేసేందుకు కుటుంబ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గౌతమ్ సింఘానియా తన మరణానంతరం తర్వాత భార్య నవాజ్‌కు ఆమోదయోగ్యం కాని ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుమతించాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది.
వాస్తవానికి దీపావళి రోజున ముంబైకి ఆనుకుని ఉన్న థానేలోని రేమండ్ ఎస్టేట్‌లో గౌతమ్ సింఘానియా దీపావళి పార్టీని ఏర్పాటు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీకి ఆయన భార్య హాజరుకాలేదు. ఇటీవల సింఘానియా చేసిన పోస్టులో కుమార్తెలు నిహారిక, నిషాలను గతంలో మునుపటిలాగానే చూసుకుంటానని పేర్కొన్నారు.
ప్రస్తుతం 58 ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోదీ కుమార్తె నవాజ్ మోదీని వివాహం చేసుకున్నారు. నవంబర్ 13న సింఘానియా స్వయంగా విడాకుల చర్చలపై భావోద్వేగ పోస్ట్ చేశారు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు మార్గాల్లో నడవాలని నిర్ణయించుకున్నట్లు అందులో చెప్పారు. దీంతో ఈ జంట 32 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications