రేమాండ్ కంపెనీ ప్రమోటర్లైన సింఘానియా కుటుంబంలో వివాదాలు కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. గౌతమ్ సింఘానియా- నవాజ్ మోదీ సింఘానియాల విడాకులు, దానికి ముందు పరిణామాలు చాలా కీలకంగా మారాయి.
దీంతో కంపెనీ బోర్డు నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. రేమాండ్ బోర్డులోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్-నవాజ్ మధ్య వైవాహిక వివాదాల మధ్య కంపెనీకి సలహా ఇవ్వడానికి స్వతంత్ర సీనియర్ న్యాయవాదిని నియమించారు. జరుగుతున్న పరిణామాలపై తాము అప్రమత్తగా ఉన్నట్లు, తగిన చర్యలు తీసుకుంటామని వారు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు.

ఇద్దరు ప్రమోటర్ డైరెక్టర్ల మధ్య వైవాహిక వివాదాలు కంపెనీ వ్యవహారాలు మరియు వ్యాపారాన్ని నిర్వహించే ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సామర్థ్యాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా ఉండేలా ఇండిపెండెండ్ టైరెక్టర్లు అప్రమత్తంగా ఉంటారని వెల్లడించారు. ఈ విషయంలో సలహా కోసం ప్రమోటర్లు లేదా కంపెనీతో ఎలాంటి సంబంధం లేని సీనియర్ స్వతంత్ర న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ని నియమించుకోవాలని నిర్ణయించారు. కంపెనీ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన క్షణంలో ముందస్తుగా చర్యలను ప్రారంభించడానికి వెనుకాడబోమని పేర్కొన్నారు.
గత నెల 13న నవాజ్ మోదీ సింఘానియా నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో మెుత్తం 1.4 బిలియన్ డాలర్లు సంపదలో 75 శాతాన్ని తనకు, ఇద్దరు కుమార్తెలకు చట్టపరంగా భరణం రూపంలో అందించాలని కోరారు. సెప్టెంబరులో గౌతమ్ తనను, కుమార్తెను తీవ్రంగా కొట్టారని భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ సమయంలో నీతా అంబానీ, అనంత్ అంబానీ తమకు కాపాడారని పేర్కొన్నారు. అయితే గౌతమ్ సింఘానియా ప్రవర్తనపై తండ్రి సైతం మీడియా ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రేమండ్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.159.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.2,168.2 కోట్ల నుంచి రూ.2,168.2 కోట్లకు చేరుకుంది. పండుగలు, వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగిందని ఫలితాల సమయంలో సింఘానియా ప్రకటించారు.


Click it and Unblock the Notifications