Raymond Group: రేమాండ్స్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా, అతని భార్య నవాజ్ సింఘానియా ప్రస్తుతం వార్తల్లో హైలైట్ గా నిలుస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత విడిపోవటం, దాని వెనుక కొన్ని నిర్గాంతపోతే విషయాలు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రేమాండ్స్ లిమిటెడ్ ప్రపంచంలో అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ ఉత్పత్తిదారుల్లో ఒక ప్రఖ్యాత భారతీయ కంపెనీగా కొనసాగుతోంది. దీనిని గౌతమ్ సింఘానిడా నడిపిస్తున్నారు. అయితే నవంబర్ 13న తన భార్యతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రకటన పెను సంచలనంగా మారింది. దీంతో నవంబర్ 13 నుంచి ఇప్పటి వరకు రేమాండ్స్ స్టాక్ 12 శాతం మేర నష్టపోయింది. దీంతో రేమాండ్స్ గ్రూప్ మార్కెట్ విలువ రూ.1,500 కోట్లు ఆవిరైంది.

విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా సింఘానియా రూ.11,668 కోట్ల సంపదలో దాదాపు 75 శాతాన్ని నవాజ్ మోదీ సింఘానియా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. వీరి విడిపోవటం చుట్టూ ఉన్న అనిశ్చితి స్టాక్ పై భారీగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలోనే నవాజ్ మోదీ మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించారు. అసలు విడిపోయేంత వరకు విషయం రావటం వెనుక జరిగిన సంచలనాలను ఆమె మీడియాకు వెల్లడించారు.
సెప్టెంబర్ 10న గౌతమ్ సింఘానియా తనను, కుమార్తెను దాదాపు 15 నిమిషాల పాటు కనికరం లేకుండా కొట్టారని నవాజ్ మోదీ వెల్లడించారు. సెప్టెంబర్ 9న ఆయన పుట్టినరోజు వేడుక తర్వాత తెల్లవారుజాము సమయంలో స్నేహితులు, పిల్లలు ఉండగానే ఈ దాడి జరిగిందని తెలిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక గదిలోకి వెళ్లి దాక్కున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై పోలీసులకు ఫోన్ చేసినా వారిని రాకుండా సింఘానియా నిరోధించారని తెలిపారు. ఈ సమయంలోనే సహాయం కోసం నీతా అంబానీ, అనంత్ అంబానీలకు ఫోన్ చేసినట్లు నవాజ్ తెలిపారు. తనను అంబానీలో కాపాడారని చెప్పింది. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు, కుటుంబం గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ముందుకు సాగుతున్నట్లు ఆమె మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications