ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ సూచనలు చేశారు. మార్కెట్లో కంపెనీలు దూకుడుగా వెళ్లాలని, అదే విధంగా వీఆర్ఎస్ మార్గదర్శకాల అమలును వేగవంతం చేయాలని, ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియను స్పీడ్ చేయాలని సూచించారు. ఇటీవల ఆయన టెలికంకంపెనీ బోర్డులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు కంపెనీలకు వివిధ సూచనలు చేశారు.

ప్యాకేజీ ఉపయోగించుకోవాలి...
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఉపయోగించుకొని దూకుడు పెంచాలని రవిశంకర ప్రసాద్ సూచించారు. ఈ రెండు కంపెనీల విలీనంతో పాటు పునరుద్ధరణ కోసం దాదాపు రూ.70వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రటించింది. అలాగే, ఉద్యోగుల వీఆర్ఎస్, ఆస్తుల మానిటైజేషన్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీఆర్ఎస్ అంశంపై ఉద్యోగులతో చర్చలు వేగవంతం చేయాలన్నారు.

80 శాతం ఉద్యోగులు వీర్ఎస్ తీసుకోవచ్చు
ఈ రెండు కంపెనీల్లో 50 ఏళ్లకు పైబడిన వారికి వీఆర్ఎస్ స్కీం పథకాన్ని అమలు చేస్తోంది. వీఆర్ఎస్ తీసుకోవడానికి ఉద్యోగులకు ఇచ్చిన లాస్ట్ డేట్ 31 జనవరి 2020. వీఆర్ఎస్ సెటిల్మెంట్ కింద రూ.17,160 కోట్లు, రిటైర్మెంట్ లయబిలిటీస్ కింద రూ.12,768 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. బీఎస్ఎన్ఎల్‌లో 1.76 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో 1.06 లక్షల ఉద్యోగులు 50 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటారని భావిస్తున్నారు.

ఉద్యోగుల వేతనాలకే 80 శాతం
బీఎస్ఎన్ఎల్‌కు వచ్చే మొత్తంలో ఉద్యోగులకు వేతనాల రూపంలోనే 75 శాతం వెళ్తుంది. ఎంటీఎన్ఎల్‌లో 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల ఖర్చు 87 శాతంగా ఉండటం గమనార్హం. ఈ రెండు కంపెనీల ఆర్థిక లాభాలు వీర్ఎస్ మీద ఆధారపడి ఉంటాయని అంటున్నారు. ఇందుకు మరో 90 రోజుల సమయం ఉంది. కాగా, వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు నష్టం జరగకుండా నిబంధనలు రూపొందించారు. ఉదాహరణకు 53.5 ఏళ్ళకు పైబడిన ఉద్యోగి వీఆర్ఎస్ తీసుకుంటే 60 ఏళ్లు వచ్చే వరకు 125 శాతం చొప్పున జీతంతో పాటు పెన్షన్, గ్రాట్యిట్యుటీ దక్కేలా ప్యాకేజీ రూపొందించారు. అదే 50 ఏళ్ల నుంచి యాభై మూడున్నరేళ్ల లోపు వయస్సు వారేతే 80 శాతం నుంచి 100 శాతంగా ఉంటుంది. వీఆర్ఎస్ పూర్తి స్వచ్చంధం. ఎవరిపైనా ఒత్తిడి ఉండదు. వీఆర్ఎస్ గడువు 31 జనవరి 2020.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications