IPO News: ప్రీమియం ధరకు ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఎగబడి పందెం కాసిన ఇన్వెస్టర్లు..
Ratnaveer Precision IPO: ఈరోజు స్టాక్ మార్కెట్లలోకి లిస్టింగ్ ద్వారా రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ స్టాక్ అడుగుపెట్టింది. ఇష్యూ ధర కంటే మంచి ప్రీమియం రేటుకు షేర్ల లిస్టింగ్ జరిగింది.
కంపెనీ ఒక్కో షేరును రూ.98కి ఇష్యూ చేసినప్పటికీ 30.61 శాతం ప్రీమియం ధరకు షేర్లు బంపర్ లిస్టింగ్ నమోదు చేశాయి. దీంతో బీఎస్ఈలో స్టాక్ ధర వద్ద రూ.128 అరంగేట్రం చేయగా.. ఎన్ఎస్ఈలో రూ.123.20వద్ద అడుగుపెట్టి ట్రేడింగ్ ప్రారంభించింది.

ఐపీవోను తెరచిన తర్వాత బలమైన బలమైన సబ్‌స్క్రిప్షన్ నంబర్‌లతో పాటు విస్తృత మార్కెట్‌లలో బలమైన లిస్టింగ్ నమోదు చేసింది. IPOలో పెట్టుబడిదారులు 110.79 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం బిడ్ చేశారు. ఇది వాస్తవంగా ఆఫర్ చేసిన 1.17 కోట్ల షేర్ల పరిమాణానికి 93.99 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌కు దారితీసింది. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో ఉన్న కంపెనీ 2002లో స్థాపించబడింది. ఇది వాషర్లు, సోలార్ రూఫింగ్ హుక్స్, పైపులు ట్యూబ్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించింది.
కంపెనీ ఇదే రకం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న Jindal Stainless, M.M. Forgings Limited, Menon Bearings Limited, Venus Pipes & Tubes Limitedలకు పోటీదారుగా ప్రస్తుతం కొనసాగుతోంది. బ్రోకరేజ్ సంస్థ స్వస్థిక్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ అనుభూతి మిష్రా ప్రకారం ఐపీవోలో షేర్లను పొందిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపొచ్చని తెలిపారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కొనసాగించాలనుకునే వ్యక్తులు రూ.116ను స్టాప్ లాస్‌గా పరిగణించవచ్చని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications