IPO: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
ప్రస్తుతం మార్కెట్ లో ఐపీఓల కాలం నడుస్తోంది. వచ్చే వారం మరిన్ని కంపెనీలు ఐపీఓగా రానున్నాయి. ఈ ఐపీఓల్లో మెయిన్ బోర్డు, చిన్న మధ్య తరహా వ్యాపారాల IPOలు ఉన్నాయి. రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ IPO సెప్టెంబర్ 4 సోమవారం సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. పబ్లిక్ ఇష్యూ బిడ్డర్‌ల కోసం బుధవారం వరకు తెరిచి ఉంటుంది. రూ.135.24 కోట్ల విలువైన 13,800,000 షేర్లతో మార్కెట్లోకి ప్రవేశించనుంది. 3,040,000 షేర్లు OFS ద్వారా రూ. 10 ఫేస్ వాల్యూ ధరతో విక్రయించనున్నారు. మొత్తం IPO పరిమాణం రూ. 165.03 కోట్లు. దీని షేరు ధర ఒక్కో షేరుకు రూ.93 నుంచి రూ.98గా నిర్ణయించారు.
ఒక లాట్ లో 150 షేర్లు వస్తాయి. ఒక్కో లాట్ కు 14,700 చెల్లించాలి. సెప్టెంబర్ 11న షేర్లు అలట్ అవుతాయి.దీని లిస్టింగ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది.రత్నవీర్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ IPO యాంకర్ ఇన్వెస్టర్ల నుండి సుమారు రూ.49.5 కోట్లను సేకరించింది. జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్ IPO బుధవారం, సెప్టెంబర్ 6న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. జూపిటర్ లైఫ్ లైన్ IPO రూ. 542 కోట్ల విలువైన షేర్లను జారీ చేస్తుంది. ప్రమోటర్లు, ఇతర వాటాదారుల ద్వారా OFS కింద 44.5 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు.

ఈ ఆరోగ్య రంగ కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.869 కోట్లు. దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.695 నుంచి రూ.735. ఈ IPO లిస్టింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. ఇన్‌ఫ్రా రంగానికి చెందిన ఈ IPO సెప్టెంబర్ 8న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఇదిఎస్ఎంఈ ఐపీఓ. సెప్టెంబర్ 12న ముగుస్తుంది. ఈ IPO తాజా ఇష్యూ విలువ రూ. 146.24 కోట్లుగా ఉంది. OFS ద్వారా 82.94 లక్షల షేర్లు జారీ చేయనున్నారు. దీని ప్రైస్ బ్యాంక్ ఒక్కో షేరుకు రూ.211గా నిర్ణయించారు.

కహాన్ ప్యాకేజింగ్ IPO అనేది SME IPO, ఇది సెప్టెంబర్ 6న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుస్తారు. 8న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.5.76 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా మూలధన అవసరాల ఆధారంగా పనిచేస్తుంది. దీని ఒక్కో షేరు ధర రూ.80 ఉండవచ్చు. ఈ వారంలో నాలుగు కంపెనీల లిస్టింగ్ జరుగుతోంది. ఇందులో విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా సెప్టెంబర్ 5న, సహజ్ ఫ్యాషన్ సెప్టెంబర్ 6న, మోనో ఫార్మాకేర్ సెప్టెంబర్ 7న ఎన్‌ఎస్‌ఈలో, సీపీఎస్ షేపర్స్ సెప్టెంబర్ 8న ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications