Multibagger Stocks : కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదను పెంచటంతో పాటు వారికి అదనంగా డివిడెండ్, బోనస్ షేర్లను కూడా అందిస్తుంటాయి. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను ఇన్వెస్టర్లు అస్సలు మిస్ కాకూడదు. ఇది పెట్టుబడిదారులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవాలి.

బోనస్ తో పాటు డివిడెండ్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ (Ratnamani Metals and Tubes Ltd) స్టాక్ గురించే. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను అందించిన తరువాత.. ఇప్పుడు డివిడెండ్ అందించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ గత కొంత కాలంగా ఇన్వెస్టర్లకు 50,000 శాతానికి పైగా రాబడులను అందించింది.

పెన్నీ స్టాక్ స్థాయి నుంచి..
గతంలో కంపెనీ షేర్లు రూ.3 నుంచి పెరిగి ఈ రోజు ఉదయం 11.45 గంటల సమయానికి 1,656.50 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా అందించింది. కంపెనీ తాజాగా ఒక్కో షేరుపై రూ.14 డివిడెండ్ ఇవ్వబోతోంది.

లక్షను కోట్లుగా మార్చి..
రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ షేర్లు విపరీతమైన దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించింది. 23 జూలై 2004న BSEలో ఈ స్టాక్ ధర కేవలం రూ. 2.96 వద్ద ఉంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు భారీ ఆదాయాన్ని పొందారు.ఒక వ్యక్తి 18 సంవత్సరాల క్రితం రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.5.60 కోట్లుగా ఉండేది.

ఆ తేదీ నాటికి షేర్లు కలిగి ఉంటే..
రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ తన ఇన్వెస్టర్లకు 1400 శాతం డివిడెండ్ ఇవ్వబోతోంది. అంటే.. ఇన్వెస్టర్లు ప్రతి షేరుపై రూ.14 డివిడెండ్ పొందుతారు. డివిడెండ్ ఎక్స్-డేట్ ఆగస్ట్ 1, 2022గా కంపెనీ నిర్ణయించింది. షేర్లను కలిగి ఉండటానికి దాని ఎక్స్-డేట్ 30 జూన్ 2022గా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,913.70 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర 1,237.07గా ఉంది.


Click it and Unblock the Notifications