Moodys ratings: దాదాపు ఏడాది క్రితం ఇదే సమయానికి స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీలు రక్తచరిత్ర రాశాయి. అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికతో పెట్టుబడిదారులు వెనక్కు మళ్లారు. అయితే సంవత్సరం తిరిగే సరికి ఎవరూ ఊహించని రేంజ్‌లో గ్రూప్ కంపెనీలను గౌతమ్ అదానీ లాభాల బాట పట్టించారు. అప్పుడు రేటింగ్స్‌ను తగ్గించిన సంస్థలే ఇప్పుడు సాహో అంటూ తలవంచుతున్నాయి.
ప్రముఖ ఇన్వెస్టర్ మరియు రేటింగ్స్ సంస్థ మూడీస్ అదానీ గ్రూప్ సంస్థలకు గుడ్‌న్యూస్ చెప్పింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల డెట్ పత్రాలపై ఔట్‌లుక్‌ను సవరించినట్లు ప్రకటించింది. నెగటివ్ రేటింగ్ ను స్టేబుల్ కు మార్చినట్లు వెల్లడించింది. కాగా మిగిలిన రేటింగ్ ఏజెన్సీలు మొత్తం గ్రూపులోని కంపెనీలన్నిటిపై స్టేబుల్ దృక్పథాన్ని కొనసాగిస్తున్నాయి.

S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అదానీ పోర్ట్స్ మరియు అదానీ ఎలక్ట్రిసిటీ క్రెడిట్ ఔట్‌లుక్‌ను 'నెగటివ్' నుంచి 'స్టేబుల్'కి అప్‌గ్రేడ్ చేసిన వారాల తర్వాత మూడీస్ సవరణ చేపట్టింది. ఫిబ్రవరి 2023లో అదానీ గ్రూప్‌లో నెలకొన్న ఆందోళనలను హైలైట్ చేస్తూ మూడీస్ ప్రారంభంలో 4 గ్రూప్ కంపెనీలపై ఔట్‌లుక్‌ను ప్రతికూలంగా మార్చింది. ఇప్పుడు వాటిని తిరిగి పూర్వపు స్థితికి అప్‌గ్రేడ్ చేసింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టెప్-వన్ లిమిటెడ్ మరియు అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ లు సానుకూల రేటింగ్స్ లభించాయి. గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువలో గణనీయమైన మరియు వేగవంతమైన క్షీణతకు దారితీసిన అదానీ గ్రూప్ పాలనా విధానాలపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
'గ్రూప్ అనేక రుణ లావాదేవీలను పూర్తి చేసింది. రీఫైనాన్సింగ్, కొత్త రుణాలను పొందడం, సహేతుకమైన ఖర్చుతో డెట్ క్యాపిటల్‌కు నిరంతర మద్ధతును ప్రదర్శిస్తోంది. అదే సమయంలో GQG మరియు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి భారీ సంస్థాగత మరియు వ్యూహాత్మక పెట్టుబడిదారుల ద్వారా అనేక ఉన్నత స్థాయి ఈక్విటీ లావాదేవీలు కూడా గ్రూప్ కంపెనీల ఎదుగుదలకు కారణమయ్యాయి' అని మూడీస్ పేర్కొంది.


Click it and Unblock the Notifications