US Rating: ప్రపంచ పెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికా వాస్తవానికి అతిపెద్ద అప్పుల సుడిగుండంపై తేలియాడుతున్న ఆర్థిక వ్యవస్థ. అందుకే అక్కడ ఏం జరిగినా అది మెుత్తం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంది.
తాజాగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కొనసాగించిన స్థిర(Stable Rating) రేటింగ్ నుంచి ప్రతికూలం(Negative Rating)కి తగ్గించటం ప్రస్తుతం పెద్ద దుమారం సృష్టిస్తోంది. అమెరికా ఆర్థిక లోటు ఎక్కువగా ఉండటం, రుణ స్థోమత క్షీణించటం రేటింగ్ తగ్గింపుకు ప్రధాన కారణంగా ఏజెన్సీ పేర్కొంది. అయితే దీనిని అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం నుంచి ఆగ్రహానికి మూడీస్ గురైంది.

దీనికి ముందు మరో ప్రఖ్యాత రేటింగ్ సంస్థ ఫిచ్ సైతం అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న రేటింగ్ ను తగ్గించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అమెరికా రుణ పరిమితి చుట్టూ అనేక నెలలు రాజకీయ ప్రతిస్టంబన నెలకొన్న సంగతి తెలిసిందే. ఫెడరల్ వ్యయం, రాజకీయ ధ్రువణత పెట్టుబడిదారులకు పెరుగుతున్న ఆందోళనకు కారణంగా ఉంది. US ప్రభుత్వ బాండ్ ధరలను 16 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి తీసుకువెళ్లిన అమ్మకానికి దారి తీసింది. వడ్డీ ఖర్చులు బడ్జెట్‌లో ఎక్కువ వాటాను తీసుకుంటాయని, రుణ భారం పెరుగుతూనే ఉంటుందని US ప్రధాన ఆర్థికవేత్త క్రిస్టోఫర్ హాడ్జ్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి తరుణంలో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి భారీగా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇది యూఎస్ ఖజానాపై మరింతగా భారాన్ని మోపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై రేటింగ్ తగ్గించటం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గిపోతుందని.. పైగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే అది భారత్ వంటి అదే వర్థమాన దేశాల స్టాక్ మార్కెట్లను, వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని కారణంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ముహురత్ ట్రేడింగ్ కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతుందనే ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications