IT News: ఐటీ కంపెనీల వ్యాపారం ఒడిదొడుకులకు లోనవటం వాటి ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది పరోక్షంగా సదరు కంపెనీల షేర్లపై కనిపిస్తోంది. ఇలాంటి అస్థిర సమయంలో ఐటీ స్టాక్స్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ JP మోర్గాన్ భారత ఐటీ పరిశ్రమలోని దిగ్గజ కంపెనీలపై షాకింగ్ నివేదికను విడుదల చేసింది. ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎంఫసిస్ కంపెనీలపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. FY24 మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీలు రాబడి, మార్జిన్లు మార్కెట్‌ను నిరాశపరుస్తాయని మోర్గాన్ అభిప్రాయపడింది. అలాగే ద్వితియార్థంలో వృద్ధి అంచనాలు తగ్గుముఖం పట్టవచ్చంది.

అమెరికాకు చెందిన ప్రముఖ రేటింగ్ సంస్థ జేపీ మోర్గన్ అంచనాల ప్రకారం మార్చి 2024 నాటికి టీసీఎస్ షేర్ రూ.2700 మార్కును చేరుకుంటుందని అంచనా వేసింది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ స్టాక్ మార్చి 2024 నాటికి రూ.1150ని తాకుతుందని వెల్లడించింది. ఇదే క్రమంలో Mphasis ధరను రూ.1,550గా నిర్ణయించింది. HCL టెక్నాలజీస్‌పై వ్యాఖ్యానిస్తూ స్టాక్ ధర రూ.800కి చేరుకుంటుందని తెలిపింది.
ఈ క్రమంలో ప్రధాన ఐటీ సేవల కంపెనీల ఆదాయాలు, ఆదాయ అంచనాలను రేటింగ్ ఏజెన్సీ తగ్గించింది. గ్లోబల్ మార్కెట్లలోని పరిస్థితుల వల్ల మార్జిన్లపై ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ఇవి ఇన్వెస్టర్లలో కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోపక్క కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రమ్మనటంతో అట్రిషన్ రేటు పెరుగుతోంది. అలాగే కంపెనీలు సైతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అధిక జీతాల పెంపుకు నిరాశ చూపుతున్నాయి.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications