IT Jobs: ఐటీ ఉద్యోగులకు ఈ ఏడాది నిరాశే.. సారీ టెక్కీస్ అంటున్న లేటెస్ట్ రిపోర్ట్స్..
IT Jobs: దేశీయ టెక్ కంపెనీల ఆదాయాల వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ICRA వెల్లడించింది. 250 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ రంగం ప్రతికూలతలను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది.
అనిశ్చితుల ప్రభావం 2024 ఆర్థిక సంవత్సరంలో నియామకాలపై కూడా భారీగానే ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. అందువల్ల కంపెనీలు సమీప కాలంలో రిక్రూట్మెంట్ తక్కువ స్థాయిలో ఉంచుతాయని.. గత రెండు త్రైమాసికాల్లో అనుకరిస్తున్న పద్ధతులనే ఫాలో అవుతాయని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వృద్ధి 8.4 శాతంగా ఉందని నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం భారతీయ ఐటీ సేవల కంపెనీలు బలమైన ఆర్డర్ బుక్ కలిగి ఉన్నప్పటికీ ఆదాయవృద్ధి మాత్రం సింగిల్ డిజిట్‌లో తగ్గుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్లలో స్థూల ఆర్థికపరమైన ప్రతికూలతల కారణంగా గడచిన రెండు త్రైమాసికాలుగా దేశీయ ఐటీ కంపెనీల వృద్ధి రేటు మందగించింది. ఈ రెండు మార్కెట్ల నుంచే దాదాపు 90 శాతం వ్యాపారం పొందుతున్నందున ఇండియన్ ఐటీ కంపెనీలు ప్రభావితం అవుతున్నాయి.
FY22లో ఇండియాలోని టాప్-5 టెక్ కంపెనీలు టెక్కీలను భారీగా నియమించుకున్నాయి. ఈ క్రమంలో మెుత్తం 2.73 లక్షల మందిని జోడించుకున్నాయి. కానీ గత FY23లో మాత్రం నియామకాలు నామ మాత్రంగానే జరిగాయి. ఈ కాలంలో కంపెనీలు కొత్తగా 83,906 టెక్కీలను మాత్రమే నియమించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నియామకాల్లో మందగింపు కొనసాగుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. ఇది అటు విద్యార్థులకు, ఇటు ఉద్యోగాల వేటలో ఉన్న టెక్కీలకు అత్యంత ప్రతికూలమైనదిగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications