India's GDP: ప్రసిద్ద రేటింగ్ సంస్థ ఫిచ్ భారత ఆర్థిక వృద్ధి అంచనాల్లో మార్పులు చేసింది. గతంలో వెల్లడించిన అంచనాల కంటే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఫిచ్ రేటింగ్స్ 2023-24 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాను గతంలో అంచనా వేసిన 6 శాతం నుంచి 6.3 శాతానికి పెంచింది. ఇది ప్రాథమికంగా మొదటి త్రైమాసికంలో బలమైన అవుట్‌టర్న్, సమీప కాల మెుమెంటం కారణంగా ఉందని తెలిపింది. మూలధన వ్యయాన్ని పెంచడం, కమోడిటీ ధరలు మితంగా పెరగడం, పటిష్టమైన క్రెడిట్ వృద్ధి పెట్టుబడులకు మద్దతునిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది.

గ్లోబల్ ట్రేడ్ మందగించడం వల్ల భారత్ కొంతమేరకు ప్రభావితమవుతుందని ఫిచ్ వెల్లడించింది. ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ గత ఏడాది నుంచి వడ్డీ రేట్లను దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర పెంచిన వేళ దాని పూర్తి ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ఇది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని తగ్గించే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో క్రమంగా తగ్గుతున్న ద్రవ్యోల్బణం వినియోగదారులకు కాలక్రమేణా ఉపసమనం అందించాలని తెలిపింది. ప్రజలు ప్రస్తుతం భవిష్యత్తు ఆదాయాల పెరుగుదల, ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే మరోపక్క రుతుపవనాల అంచనా, ఎల్‌నినో యొక్క సంభావ్య ప్రభావం ఏడాది రెండవ అర్థభాగంలో ప్రమాదాన్ని కలిగిస్తుందని ఫిచ్ తెలిపింది.

ప్రపంచ వాణిజ్య మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి, నష్టాలను తగ్గించుకోవటానికి ప్రభుత్వ విధానాలు సహాయపడతున్నాయని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. రాబోయే నెలల్లో వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు భారత్ మంచి స్థానంలో ఉందని పేర్కొంది.


Click it and Unblock the Notifications