Fitch: భారత్ భవిష్యత్తుపై ఫిచ్ కీలక కామెంట్స్.. మోదీ పాస్ మార్కులతో సరిపెట్టుకోవడంతో..
India growth: దేశంలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రంలోని మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. గతంలో మాదిరిగా పూర్తి మెజారిటీ రాకపోవడంతో NDA కూటమిలోని పార్టీలను కలుపుకుని వెళ్లాలని భావిస్తుంది. అందుకు తగిన విధంగా మిత్రపక్షలతో ఢిల్లీలో భేటీ సైతం నిర్వహించింది. మరో మూడు రోజుల్లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత అభివృద్ధిపై ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ కీలక కామెంట్స్ చేసింది. దేశంలో సంస్కరణల అమలుపై ఘాటుగా స్పందించింది. BJPకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో కార్మిక, భూ సంస్కరణ విషయంలో దూకుడుగా వ్యవహరించే పరిస్థితి లేదని భావిస్తున్నట్లు చెప్పింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత స్థాయిలో వృద్ధి సాధించడంలో కొంత వెనకబడవచ్చని అంచనా వేసింది.

అయినప్పటికీ మంచి బ్యాలెన్స్ షీట్ తో అపార వనరులు ఉండటంతో భారత్ తన సత్తా చాటుతుందని తేల్చి చెప్పింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల వల్ల కొంతమేర ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడింది. BJP ప్రాధాన్యతల విషయంలో ఎదురుగాలి వీయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. కానీ వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్లగలదని విశ్వాసం వ్యక్తం చేసింది.
'543 స్థానాలు కలిగిన లోక్ సభలో BJP కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. NDA కుటుంబంలోని సీట్లు అన్నీ కలిపితే 292కు చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు పూర్తి మెజారిటీ సాధించలేక BJP మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. తద్వారా పలు సంస్కరణల అమలు కుంటుపడే అవకాశం ఉంది. అదే జరిగితే మీడియం టర్మ్ వృద్ధి అవకాశాలు కొంతమేర దెబ్బతింటాయని భావిస్తున్నాం' అని ఫిచ్ తన నోట్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications