Gold Price Today: గతవారం చివరి నుంచి స్థిరంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం తిరిగి పుంజుకున్నాయి. దీంతో దేశంలోని పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. వారాంతంలో కొనుగోళ్లు చేపట్టాలనే వారి ప్లాన్స్ ప్రస్తుతం తలకిందులవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా నేడు పెరిగిన పసిడి ధరలను దేశవ్యాప్తంగా పరిశీలిస్తే..
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్ననేడు కలిపి 100 గ్రాములకు ఏకంగా రూ.5000 భారీ పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో నేడు దేశీయ మార్కెట్లలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.6685, ముంబైలో రూ.6625, దిల్లీలో రూ.6640, కలకత్తాలో రూ.6625, బెంగళూరులో రూ.6625, కేరళలో రూ.6625, వడోదరలో రూ.6630, జైపూరులో రూ.6640, మంగళూరులో రూ.6625, నాశిక్ లో రూ.6628, అయోధ్యలో రూ.6640, బళ్లారిలో రూ.6625, నోయిడాలో రూ.6640 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు శుక్ర-శనివారాల్లో కలిపి 100 గ్రాములకు ఏకంగా రూ.5500 భారీ పెరుగుదలను చూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పెరిగిన ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7293, ముంబైలో రూ.7228, దిల్లీలో రూ.7242, కలకత్తాలో రూ.7228, బెంగళూరులో రూ.7228, కేరళలో రూ.7228, వడోదరలో రూ.7232, జైపూరులో రూ.7242, మంగళూరులో రూ.7228, నాశిక్ లో రూ.7231, అయోధ్యలో రూ.7242, బళ్లారిలో రూ.7228, నోయిడాలో రూ.7242 గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,625గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,228 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.94,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications