Ratan Tata: దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది టాటా గ్రూప్ అని అనుమానం లేకుండా మన చరిత్ర చూస్తే తెలుస్తుంది. భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులెత్తించే క్రమంలో టాటాలు అనేక రంగాల్లో కొత్త కంపెనీల ఏర్పాటుతో పాటు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పరంపరను రతన్ టాటా సైతం తన ప్రయాణంలో కొనసాగిస్తూనే ఉన్నారు.
దేశంలో కొనసాగుతున్న స్టార్టప్ బూమ్‌లో రతన్ టాటా సైతం పాల్గొన్నారు. వృద్ధికి అవకాశం ఉన్న అనేక కంపెనీల్లో టాటా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు నాటిన పెట్టుబడి విత్తనాలు ప్రస్తుతం మంచి లాభాల దిగుబడిని అందిస్తోంది. అవును ఆగస్టు 6న దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోగా అడుగుపెడుతున్న ఫస్ట్‌క్రై(FirstCry IPO)లో సైతం రతన్ టాటా పెట్టుబడులను కలిగి ఉన్నారు. తాజాగా కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ప్రకటించింది. ఈ లిస్టింగ్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు భారీ లాభాలను తెచ్చిపెట్టనుంది. అయితే మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ మాత్రం ఐపీవోతో నష్టపోనున్నారు.

ఐపీవోలో పాల్గొనే వారి కోసం ఫస్ట్‌క్రై సంస్థ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.440-465గా నిర్ణయించింది. ఆగస్టు 6 నుంచి 8 వరకు కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు అవకాశాన్ని తెరచి ఉంచనుంది. ఈ క్రమంలో మార్కెట్ల నుంచి రూ.4,194 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. అయితే ఈ ఇష్యూలో రూ.1,666 కోట్లకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ఉండగా మిగిలిన రూ.2,528 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో సమీకరించనుంది. ఇందుకోసం ఓఎఫ్ఎస్ కింద విక్రయానికి 5.44 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో లిస్టింగ్ ఆగస్టు 13న ఉండనుంది.
రతన్ టాటా 2016లో పెట్టుబడులు ప్రస్తుతం ఐపీవో ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధర ప్రకారం రూ.3.62 కోట్లను సంపాదించనున్నారు. వాస్తవానికి కంపెనీలో 86 ఏళ్ల రతన్ టాటాతో పాటు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్-ఆధారిత సంస్థలో 0.02% వాటాను 66 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రతన్ టాటా తాజా ఐపీవోలో కంపెనీలో ఉన్న 77,900 షేర్లను విక్రయానికి ఉంచారు. అయితే ఇదే కంపెనీలో 2023 అక్టోబరులో సచిన్ టెండూల్కర్, భార్య అంజలి సంయుక్తంగా 2,05,153 షేర్లను ఒక్కోటి రూ.487.44 రేటుకు కొనుగోలు చేశారు. అయితే అప్పట్లో రూ.10 కోట్ల వారి పెట్టుబడి విలువ ఐపీవో గరిష్ఠ ధర ప్రకారం ప్రస్తుతం రూ.9.5 కోట్లకు తగ్గింది. అంటే వారి పెట్టుబడి విలువ దాదాపు 5 శాతం క్షీణతను చూసింది. ప్రస్తుతానికి సచిన్ టెండూల్కర్ నష్టాల్లో ఉన్నప్పటికీ మార్కెట్లో కంపెనీ లిస్టింగ్ తర్వాత ధర పెరిగితే లాభాలను పొందే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications