Ratan Tata: రతన్ టాటా రూ.10 వేల కోట్ల ఆస్తి.. వీలునామాలో పెంపుడు కుక్క, పనివారికి ఎంతిచ్చారంటే..
Ratan Tata Will: దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా. వందల కోట్ల వ్యాపారాలకు సారధిగా ఉన్న ఆయన టాటాల వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు టాటా సంస్థల లాభాలను విరివిగా ఉపయోగించిన సంగతి తెలిసిందే. అయితే రతన్ టాటా మరణం తర్వాత తాజాగా ఆయన ఆస్థికి సంబంధించి రాసిన వీలునామా వెలుగులోకి వచ్చింది.
86 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాకు చెందిన రూ.10 వేల కోట్ల ఆస్థి వారి సోదరుడికి, ఫౌండేషన్‌కి ఇవ్వబడింది. ఈ వీలునామాలో జిమ్మీ టాటా,షిరీన్, డీన్నా జెజీబోయ్, పర్సనల్ సిబ్బందితో పాటు పెంపుడు కుక్క ఉన్నారు. టాటాకు చాలాకాలంగా వంటవాడిగా పనిచేస్తున్న రాజన్ షా, బట్లర్ సుబ్బయ్యకు ఈ పెంపు కుక్క బాధత్యలను అప్పగించినట్టు తెలుస్తోంది. అలాగే మిగిలిన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని రతన్ టాటా తన ఫౌండేషన్‌కు కేటాయించారు.

రతన్ టాటాకు కుక్కలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. టాటా మేనేజర్ శంతను నాయుడిని రతన్ టాటాను కలిపిన అంశంసైతం కుక్కల సంరక్షణ అని మనందరికీ తెలిసిందే. దాదాపు 6 ఏళ్ల కిందట రతన్ టాటా జర్మన్ షెపర్డ్ కుక్క టిటోను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాటాకు ఇష్టమైన ఒక కుక్క మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీలునామాలో ఈ కుక్క సంరక్షణకు టాటా కేటాయించారని వెల్లడైంది. ఇకపై టిటో కుక్క సంరక్షణ బాధ్యతలను చిరకాల కుక్ రాజన్ షా చూసుకోనున్నారు. రతన్ టాటా వీలునామాలో దాదాపు 30ఏళ్లు తన బట్లర్‌గా పనిచేసిన సుబ్బయ్యకు కూడా వాటాను కల్పించారు. రతన్ టాటా విదేశాలకు వెళ్లినప్పుడు బట్లర్ సుబ్బయ్య కోసం అత్యాధునిక దుస్తులు షాపింగ్ చేసేవారు.
ఇదే క్రమంలో రతన్ టాటా మరణం వరకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకి కూడా వీలునామాలో చోటు కల్పించబడింది. ఈ క్రమంలో శంతను నాయుడు విదేశాల్లో చదువు కోసం తీసుకున్న రుణఆన్ని మాఫీ చేశారు. రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం టాటా సన్స్, టాటా గ్రూప్ వివిధ కంపెనీలలో ఆయన వాటా ఇప్పుడు టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ కి బదిలీ చేయబడతాయి. అలాగే రతన్ టాటా బతికున్న సమయంలో అనేక స్టార్టప్ కంపెనీల్లో వ్యక్తిగతంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా లిక్విడేట్ చేసి ఫౌండేషన్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. టాటాకు చెందిన ఖరీదైన కార్లను విక్రయించటం లేదా పూణేలోని మ్యూజియం కోసం టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చని వినికిడి.
టాటా చివరి రోజుల్లో ముంబై కొలాబాలోని హలేకై ఇంటిలో నివశించారు. ఇది టాటా సన్స్‌కు చెందిన ఎవార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ యాజమాన్యంలో ఉంది. దీనికి తోడు అలీబాగ్‌లో 2వేల చదరపు అడుగుల బీచ్ బంగ్లా కూడా రతన్ టాటా కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు రతన్ టాటా నివాసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. చివరిగా రతన్ టాటా అంతిమ కోరికలను నెరవేర్చే బాధ్యతలను షిరీన్, డీన్నా జెజీబోయ్‌లతో పాటు న్యాయవాది డారియస్ ఖంబటా, దీర్ఘకాల సహచరుడు మెహ్లీ మిస్త్రీపై రతన్ టాటా ఉంచారు.


Click it and Unblock the Notifications