Ratan Tata: స్టార్టప్ ఆలోచనలకు తన పెట్టుబడితో ఆయువు పోస్తుంటారు దేశీయ వ్యాపార వేత్త రతన్ టాటా. అయితే ఆయన తాజాగా మరో కొత్త స్టార్టప్ కు తన సహకారాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సారి ఆయన సీనియర్ సిటిజన్ల కోసం తెచ్చిన సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

శంతను నాయుడు స్థాపించిన..
ఆగస్ట్ 16న పారిశ్రామికవేత్త రతన్ టాటా తన కార్యాలయంలో మేనేజర్ అయిన శంతను నాయుడు స్థాపించిన సీనియర్ కంపానియన్‌షిప్ స్టార్టప్ గుడ్‌ఫెలోస్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించారు. అయితే శంతను నాయుడుకు రతన్ టాటాతో ఉన్న స్నేహం గురించి మనకు ఇంతకు ముందే తెలుసు. గతంలో వీధి కుక్కలను కాపాడేందుకు నాయుడికి టాటా అందించిన సహకారం గురించి మనం ఇప్పటికే విన్నాం.

ఏఏ నగారాల్లో సేవలు..
గుడ్‌ఫెలోస్ స్టార్టప్ సీనియర్ సిటిజన్‌లను యువ గ్రాడ్యుయేట్‌లతో జత చేసే పెయిడ్ సర్వీస్. గత ఆరు నెలలుగా పూణేలో స్టార్టప్ బీటా దశను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కంపెనీ.. ముంబై, చెన్నై, బెంగళూరులలో తన కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది.
రతన్ టాటా ఏమన్నారంటే..
పెట్టుబడి గురించి టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానిస్తూ.. "గుడ్‌ఫెలోస్ సృష్టించిన రెండు తరాల మధ్య బంధాలు చాలా అర్థవంతమైనవి. దేశంలో ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. గుడ్‌ఫెలోస్‌లోని యువ జట్టు ఎదగడానికి పెట్టుబడి సహాయపడుతుందని తాను ఆశిస్తున్నట్లు రతన్ టాటా వెల్లడించారు.
ఎందుకిలా..
కంపెనీ ప్రకారం.. నియమించుకున్న యువ గ్రాడ్యుయేట్లు వృద్ధుల పట్ల సానుభూతి, అనుబంధం కోసం పరీక్షించబడ్డారు. క్లయింట్‌లతో "ప్రామాణికమైన, అర్థవంతమైన మార్గంలో" పాల్గొనగల ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. వేర్వేరు వ్యక్తుల మధ్య సాంగత్యం భిన్నంగా ఉంటుందని నాయుడు తెలిపారు. సినిమాలు చూడటం, కథలు చెప్పటం, వాకింగ్ కు వెళ్లటం ఇలా అనేక మందికి అనేక అవసరాలు ఉంటాయని అతను తెలిపాడు.

సేవల వివరాలు..
గుడ్‌ఫెలోస్ వ్యాపార నమూనా ప్రకారం "ఫ్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్" అంటే మొదటి నెల సేవలు ఉచితంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత చిన్న చందా రుసుము ఉంటుంది. కంపెనీ ప్రతి నెల సమావేశాలను నిర్వహిస్తుంది. ఇక్కడ క్లయింట్లు "ఒకరినొకరు అలాగే ఎక్కువ మంది యువ గ్రాడ్యుయేట్‌లను కలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications