FirstCry IPO: దేశంలోని అనేక స్టార్టప్ కంపెనీలు కొత్త ఏడాదిలో తమ ఐపీవోలను మార్కెట్లోకి ఫ్లోట్ చేయాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే లాభదాయకమైనవిగా మారేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫస్ట్‌క్రై గురించే. వాస్తవానికి దీని మాతృసంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ త్వరలోనే ఐపీవోను స్టాక్ మార్కెట్లలోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ స్టార్టప్ కంపెనీలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా సైతం పెట్టుబడులను కలిగి ఉన్నారు. ఇప్పటికే కంపెనీ ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు సమర్పించింది.

ప్రస్తుతం వార్తల్లో ఉన్న సమాచారం ప్రకారం రతన్ టాటా ఫస్ట్ క్రైలో తన 77,900 షేర్లను విక్రయించనున్నారని తెలుస్తోంది. సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం ఐపీవో ద్వారా స్టార్టప్ కంపెనీ రూ.1,816 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేయనుందని వెల్లడైంది. ఇందుకోసం దాదాపు 5.44 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారని వెల్లడించింది.
వాటాలను విక్రయిస్తున్న జాబితాలో.. మహీంద్రా & మహీంద్రా, TPG, న్యూ క్వెస్ట్ ఆసియా, SVF ఫ్రాగ్ (కేమాన్) లిమిటెడ్, ఆప్రికాట్ ఇన్వెస్ట్‌మెంట్స్, వాలియంట్ మారిషస్, TIMF, థింక్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ష్రోడర్స్ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లు ఉన్నారు. ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో 0.58 శాతం వాటా అంటే 28 లక్షల షేర్లను విక్రయించనుండగా, సాఫ్ట్‌బ్యాంక్ సైతం ఈ-కామర్స్ మేజర్‌లో తన వాటాను తగ్గించుకునే ప్రయత్నంలో 2.03 కోట్ల షేర్లను విక్రయించనుందని సమాచారం.
ఐపీవో ద్వారా వచ్చిన డబ్బును భారత్‌తో పాటు సౌదీ అరేబియాలో కొత్త దుకాణాలు, గిడ్డంగులను తెరవడానికికంపెనీ ఉపయోగిస్తుంది. అలాగే కొంత మెుత్తాన్ని మార్కెటింగ్ కార్యక్రమాలకు కూడా వినియోగించనుంది. అయితే షేరు ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఫస్ట్‌క్రై తల్లులు & పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించే వ్యాపారంలో నిమగ్నమై ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications