Ratan Tata: ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా..!!
Ratan Tata Hospitalized: భారతదేశంలోని అత్యున్నత వ్యాపార సంస్థగా కొనసాగుతున్న టాటా గ్రూప్ లీడ్ చేస్తున్న వ్యక్తి రతన్ టాటా. ప్రస్తుతం రతన్ టాటా వయస్సు 86 ఏళ్లు. ప్రస్తుతం ఆయన వయోభారంతో రోజువారీ కార్యక్రమాలకు కొద్దిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.
రతన్ టాటా రక్తపోటులో గణనీయమైన తగ్గుదల కారణంగా 12:30 నుంచి 1:00 గంటల మధ్య సమయంలో ఆసుపత్రిలో చేరినట్లు వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడైంది. ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్‌వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం.

సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణను వైద్యుల బృందం అందిస్తోంది. టాటా ఆరోగ్యాన్ని నార్మల్ చేసేందుకు వారు కృషి చేస్తుండగా ప్రస్తుత స్థితిపై బులిటెన్ విడుదల చేసేవరకు పూర్తి వివరాలు అందుబాటులోకి రావని తెలుస్తోంది.
రతన్ టాటా క్లారిటీ..
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై రతన్ టాటా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆయన తన వయస్సు కారణంగా రెగ్యులర్ మెడికల్ చెక్ అప్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని మీడియా తప్పుడు కథనాలను ప్రచురించవద్దని కోరారు.


Click it and Unblock the Notifications