IPO News: అడుగుపెట్టగానే షేరుకు రూ.100 లాభం.. ఐపీవో బంపర్ లిస్టింగ్, షేర్ల కోసం ఆగని వేట
Rappid Valves IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో నెల చివరి రోజు సైతం ఐపీవోల కోలాహలం కొనసాగుతూనే ఉంది. నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎస్ఎమ్ఈ ఐపీవో ప్రీమియం లిస్టింగ్ నమోదు చేయటంతో పాటు ఆ తర్వాత కూడా ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపించటంతో మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాపిడ్ వాల్వ్స్ కంపెనీ ఐపీవో గురించి. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన స్మాల్ క్యాప్ కంపెనీ లిస్టింగ్ రోజునే సంచనాలు సృష్టిస్తోంది. కంపెనీ షేర్లు నేడు 40 శాతం ప్రీమియం ధర రూ.312 వద్ద ఒక్కోటి మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.210-222గా దరఖాస్తుదారులకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విజయవంతంగా రూ.30.41 కోట్లను సమీకరించింది.

విజయవంతంగా లిస్టింగ్ అయిన తర్వాత సైతం కంపెనీ షేర్ల కొనుగోలుకు తాకిడి కొనసాగటంతో షేర్ల ధర దాదాపు 3 శాతానికి పైగా లాభపడింది. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.327.60 స్థాయికి చేరుకున్నాయి. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో కంపెనీ షేర్లు జాబితా తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 69.46 శాతం నుంచి 51.13 శాతానికి పడిపోయింది. కంపెనీ ఐపీవో లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా ఉంచింది. దీంతో ఒక లాట్ కొనుగోలు కోసం ఇన్వెస్టర్లు రూ.1.33 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8.64 కోట్లను సమీకరించింది.

కంపెనీ ఐపీవో నుంచి సమీకరించిన సొమ్మును కొత్త ప్లాంట్ ఏర్పాటులో మెషినరీ, సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం ప్రధానంగా వినియోగించనుంది. అలాగే ప్రస్తుతం ఉన్న తయారీ యూనిట్ల పునరుద్ధరణ కోసం కొంత భాగాన్ని కంపెనీ వెచ్చించాలని నిర్ణయించింది. మిగిలిన మెుత్తాన్ని రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. ఇక కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే.. రాపిడ్ వాల్వ్స్ కంపెనీ 2002లో స్థాపించబడింది. సంస్థ ప్రధానంగా వాల్వ్ ఉత్పత్తి శ్రేణిలో బాల్, గేట్, గ్లోబ్, బటర్‌ఫ్లై, చెక్, డబుల్ బ్లాక్, ఫిల్టర్, మెరైన్ వాల్వ్‌లు ఉన్నాయి. వివిధ అవసరాలను తీర్చేందుకు కంపెనీ 15 మిల్లీ మీటర్ల నుంచి 600 మిల్లీ మీటర్ల వరకు వివిధ ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులో ఉంచింది.


Click it and Unblock the Notifications