నెలంతా కష్టపడినా పాతికా ముప్ఫై వేలు సంపాదించడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగైదు పనులు చేస్తూ నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నా అని చెప్తున్నాడు ఒక ర్యాపిడో డ్రైవర్. ఇతని కథ విని నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ముఖ్యంగా లింక్డ్‌ఇన్‌లో ఇప్పుడు ఒక కథనం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే ఒక రాపిడో డ్రైవర్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి రోజంతా కష్టపడుతున్నాడు. అతడు ఎన్ని పనులు చేస్తున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!
పోస్ట్ సారాంశం ఇదీ..
ఈ ర్యాపిడో డ్రైవర్ గురించి కోమల్ పోర్వాల్ అనే కాపీ రైటర్ లింక్డ్ ఇన్ లో ఇలా రాసింది. ఆమె రాత్రి 9 గంటల సమయంలో ర్యాపిడో రైడ్ తీసుకుందట. దారిలో వెళ్తూ.. రాపిడో డ్రైవర్‌తో సరదాగా మాటలు కలిపింది. డ్రైవర్ చాలా ఉల్లాసంగా, చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడని కోమల్ చెప్తోంది. అయితే మాటల్లో మాటగా కోమల్ అతన్ని "మీరు రోజంతా ఇదే పని చేస్తారా?" అని అడిగింది. దానికి ఆ డ్రైవర్ నవ్వుతూ చెప్పిన సమాధానానికి కోమల్ ఆశ్చర్యపోయింది.
అతడు ఉదయం స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తాడట. ఆ తర్వాత ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తాడట. వీకెండ్స్ లో తన సోదరుడితో కలిసి పానీ పూరీ స్టాల్ నడుపుతాడట. ఇలా చెప్పి.. "మేడమ్, కొంచెం కష్టంగానే ఉంది. కానీ మా ఇల్లు మాత్రం చాలా సంతోషంగా నడుస్తోంది" అని అన్నాడట. ఇంతకీ అతనికి ఎంత సంపాదన వస్తుంది అని కోమల్ అడగగా.. అతను ఈ మూడు పనులు కలిపి నెలకు దాదాపు రూ.1 లక్ష సంపాదిస్తున్నానని చెప్పడంతో కోమల్ షాకైంది. "ఈ రోజుల్లో ఎవరూ అంతగా కష్టపడటం లేదు" అనే అపోహను ఈ డ్రైవర్ పటాపంచలు చేశాడని కోమల్ తన పోస్ట్‌లో రాసింది.
సోషల్ మీడియా రెస్పాన్స్
కోమల్ ఈ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్(trending) అయ్యింది. కొద్ది సేపట్లోనే వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఒక నెటిజన్ "నిజమే! మన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తేనే మనం ఎన్నో అద్భుతమైన కథనాలను, వ్యక్తులను చూస్తాం" అని రాశారు. మరొకరు.. "సంతోషంగా, పాజిటివ్‌గా ఉండే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. అదే డబ్బు వెనుక పరుగెత్తే వాళ్ళు ఒత్తిడికి లోనై, ఆరోగ్యంగా ఉండలేక ఇబ్బంది పడతారు"అని పోస్ట్ చేశాడు. ఇక మరో నెటిజన్.. "విలువైన కష్టం అంటే ఇదే. నేను ఒకసారి క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడబోతే అతను మాట్లాడలేదు. ఎందుకు అని అడిగితే, తను మాట్లాడినందుకు ఓలా కంపెనీ నుంచి వార్నింగ్ వచ్చిందంట!" అని రాశారు.
అదే నిజమైన ఆనందం
కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లకు అవకాశాలు, విజయం తప్పక దక్కుతాయని ఈ కథ మనకు చెప్తుంది. కష్టపడి పని చేయడంలోనే నిజమైన ఆనందంతో పాటు సంపాదన రహస్యం కూడా దాగి ఉందని ఈ డ్రైవర్ నిరూపించారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications