Quick Commerce News: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో 'క్విక్ కామర్స్' ముందు వరుసలో ఉంటుంది. దీంతో ఇ-కామర్స్ సంస్థలు కూడా ఈ రంగంలో సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటితో పాటు పలు ఇతర రంగాలకు చెందిన కంపెనీలు సైతం పెట్టుబడులు పెడుతూనో లేదా డైరెక్టుగానో ఈ విభాగంలో ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్నాయి. ఇదో కోవలోకి ఇప్పుడు ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ వచ్చి చేరింది.
ఇటీవల యూనికార్న్‌గా మారిన రైడ్-హెయిలింగ్ స్టార్టప్ రాపిడో.. క్విక్ కామర్స్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. ఈ విభాగంలోని స్టార్టప్ జెప్టో, గ్రోసర్స్ పిన్‌కోడ్ మరియు KPNలతో ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. తన డెలివరీ ఫ్లీట్‌లో 90 శాతం కంటే ఎక్కువ తమ కంపెనీ నియంత్రణలో ఉందని జెప్టో CEO ఆదిత్ పలిచా తెలిపారు. అయితే ఈ రెండు సంస్థల మధ్య చర్చల గురించి వ్యాఖ్యానించడానికి ఇరు కంపెనీలు నిరాకరించాయి.

'చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. నెక్సస్ వెంచర్ పార్టనర్స్ రెండు కంపెనీలలో ఒక సాధారణ పెట్టుబడిదారు కావడంతో వీటి గురించి మీడియాలో వార్తలు రావడం సహజమే' అని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగళూరుకు చెందిన రాపిడో తన బిజినెస్-టు-బిజినెస్ (B2B) లాజిస్టిక్స్ విభాగంలో ప్రస్తుతానికి కేవలం ఇద్దరు ప్లేయర్స్ స్విగ్గీ మరియు ONDCలతో మాత్రమే కలిసి పనిచేస్తోంది. రాపిడోలో స్విగ్గీ పెట్టుబడులు పెట్టి భాగస్వామిగా ఉండటం గమనార్హం.
'పాఠశాలలు, కార్యాలయాలు మరియు కళాశాల పనివేళల్లో బైక్ టాక్సీ సేవలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. క్విక్ కామర్స్ కంపెనీలతో పార్టనర్‌షిప్ వల్ల డ్రైవర్లు రోజంతా వాహనాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్లాట్‌ఫారమ్‌పై గడిపే అదే సమయంలో వారి ఆదాయాలు 25 శాతం పెరుగుతాయి' అని రాపిడో వ్యవస్థాపకులు అరవింద్ సంకా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పెట్టుబడిదారు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్‌లో 200 మిలియన్ డాలర్లను రాబట్టిన రాపిడో వాల్యుయేషన్ గత వారం 1.1 బిలియన్ డాలర్లకు చేరింది. బైక్ టాక్సీలు, ఆటో మరియు క్యాబ్ రైడ్‌ల ద్వారా ప్రస్తుతం రోజుకు 2.5 మిలియన్ ఆర్డర్‌లను నిర్వహిస్తోంది. మొత్తం వ్యాపారంలో B2B బిజినెస్ 7 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించి డెలివరీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 100 నగరాల్లో 7 లక్షల మంది రైడర్లతో సేవలందిస్తోంది. ఇదే జోష్‌తో రానున్న రోజుల్లో మరిన్ని రంగాల్లోకి విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications