Bike taxi: ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతలు, వాటితో పాటు వివిధ ఆప్షన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో ప్రయాణాలు చేయాలంటే గతంలో విసుగొచ్చేంది. సమయానికి బస్సులు రాక నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వాటికి అడ్డుకట్ట వేస్తూ ర్యాపిడో, ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్లు రంగప్రవేశం చేశాయి. అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ, ఇవాళ అవి లేనిదే నగర జీవనం దుర్భరం అనే స్థాయికి ఎదిగాయి.
ర్యాపిడో కేవలం ఉన్న చోటనే ఆగిపోకుండా బైక్ ట్యాక్సీ నుంచి మొదలుపెట్టి క్యాబ్ మరియు ఆటో సేవలను ప్రవేశపెట్టింది. ఓలా బాటలోనే పయనిస్తూ తన వ్యాపారాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేసింది. సర్వీస్ డెలివరీని మెరుగుపరడంతో పాటు దాని టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను కూడా స్కేల్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకుగాను 200 మిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులు రాబట్టేందుకు మార్గం సుగమమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి నిధుల సమీకరణ హామీతో మంచి జోష్ మీదున్న ర్యాపిడో మరో రికార్డ్ సృష్టించేందుకు కూడా రెడీ అయింది. థింక్ ఇన్వెస్ట్‌మెంట్స్ మరియు ఇన్వస్ ఆపర్చునిటీస్‌తో పాటు ఇప్పటికే ఉన్న నెక్సస్ భాగస్వామ్యంతో కలిసి బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. దీంతో యూనికార్న్ క్లబ్‌లో ర్యాపిడో చేరిక ఇక లాంఛనమే కానుంది.
బైక్-టాక్సీలు, మూడు చక్రాల వాహనాలు మరియు టాక్సీ-క్యాబ్‌లతో సహా అన్ని వర్గాలలో తన కార్యకలాపాలను పెంచుకోవాలని ర్యాపిడో యోచిస్తోంది. ఇందుకోసం సమీకరించదలచిన తాజా పెట్టుబడితో ర్యాపిడో వాల్యుయేషన్‌ను 1.1 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది పట్టణ ప్రజారవాణా రంగంలో దాని బలమైన స్థానాన్ని సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications