ransomware attack: దూసుకుపోతున్న సాంకేతికతకు తోడు మోసాలూ అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ పై రాన్సమ్ వేర్ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC)కు సంబంధించిన US యూనిట్‌పై గురువారం రాన్సమ్ వేర్ దాడి జరిగింది. దీనివల్ల US ట్రెజరీ మార్కెట్‌లో కొన్ని ట్రేడ్‌లకు అంతరాయం కలిగింది. అయితే దీని ప్రభావం పరిమితంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

రాన్సమ్ వేర్ దాడి కొన్ని సిస్టమ్స్ కు అంతరాయం కలిగించినట్లు ICBC ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. సిస్టమ్స్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయంలో మంచి పురోగమితి సాధించామని చెప్పింది.
బుధవారం జరిగిన ట్రెజరీ ట్రేడ్‌లతో పాటు గురువారం నాటి రీపర్‌చేస్ అగ్రిమెంట్‌ల (రెపో) ఫైనాన్సింగ్ ట్రేడ్‌లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు బ్యాంక్ తెలిపింది. మార్కెట్‌పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్-డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
రష్యాతో సన్నిహిత సంబంధాలు కలిగిన లాక్‌బిట్ అనే ఓ క్రిమినల్ గ్యాంగ్ ఈ పని చేసి ఉండవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇటీవల కాలంలో అనేక రంగాల్లో రాన్సమ్ వేర్ దాడులు పెరుగుతున్నప్పటికీ.. ప్రధాన ఆర్థిక మార్కెట్లకు అంతరాయం కలిగించడం చాలా అరుదు. గురువారం నాటి ఘటన.. మార్కెట్ పార్టిసిపెంట్‌ల సైబర్ సెక్యూరిటీ నియంత్రణలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications