IT News: HCLకు బిగ్‌ షాక్.. 4 ట్రిలియన్ల mcap ఆనందం ఆవిరి.. ఏం జరిగిందంటే..

HCL: భారతీయ సాంకేతిక రంగం అభివృద్ధిలో HCLTech పాత్ర ఎంతో ఉంది. తాజాగా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 ట్రిలియన్లు దాటింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన 13వ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. అయితే సంస్థకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవేదని చెప్పవచ్చు. అకస్మాత్తుగా వచ్చి పడిన ఓ పెద్ద విపత్తు నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

తను హ్యాండిల్ చేస్తున్న ఓ క్లౌడ్ ప్రాజెక్టు రాన్సమ్‌వేర్ దాడికి గురైనట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఇందుకు గల కారణాలను, భద్రతా వైఫల్యాలను అర్థం చేసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పింది. సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Ransomeware attack on HCL days after attained 4 trillion market capitalization

'సైబర్ భద్రత మరియు డేటా ప్రొటెక్షన్ కు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఘటనకు గల మూల కారణాన్ని అంచనా వేయడానికి మరియు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీని కారణంగా మా మొత్తం నెట్‌వర్క్‌పై ఎటువంటి ప్రభావం లేదు' అని HCLTech తెలిపింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ప్లానింగ్ నుంచి ఓ భారీ కాంట్రాక్టును పొందినట్లు ఈనెల 14న HCL ప్రకటించింది. ప్రజా రవాణా వినియోగదారులకు సంబంధించిన రాయితీ ప్రక్రియను ఆటోమేట్ చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. అయితే ఇంతలోనే ఇలా జరగడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+