టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటీష్ ఆటోమొబైల్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. టాటా మోటార్స్ ఇక నుంచి జగ్వార్ ల్యాండ్ రోవర్ ను భారతదేశంలోనే తయారు చేయనుంది. ఇప్పటి వరకు రేంజ్ రోవర్ బ్రిటన్‌లో మాత్రమే తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేవారు. దీని కారణంగా కంపెనీ టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ ఈ కారు ఇండియాలో ధర ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దేశంలో ఉత్పత్తి ప్రారంభంతో దాని రేట్లు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
రేంజ్ రోవర్ ధర దాదాపు 20 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. భారతదేశంలో రేంజ్ రోవర్ మోడల్స్ రూ.68 లక్షల నుంచి రూ.4.5 కోట్ల వరకు ఉన్నాయి. ధరలు 20 శాతం తగ్గితే.. ఈ మోడల్స్ రూ. 15 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు తగ్గుతాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రకారం, ఇది పూణే ప్లాంట్‌లో అన్ని రేంజ్ రోవర్ మోడల్‌ల అసెంబ్లీని ప్రారంభిస్తుంది. దీని తరువాత, కార్ల ధరలు 18 నుంచి 22 శాతం వరకు తగ్గవచ్చు. రేంజ్ రోవర్ స్పోర్ట్ డెలివరీ కూడా ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది.

దేశంలో ఉత్పత్తిని ప్రారంభించడం వల్ల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. ఇది మాకు ప్రత్యేక అవకాశమన్నారు. దేశంలో రేంజ్ రోవర్ సిరీస్ ఉత్పత్తిని ప్రారంభించడం తమకు గర్వకారణంగా ఉందని చెప్పారు. భారతదేశంలో తయారీ ప్రారంభించిన తర్వాత, రేంజ్ రోవర్ అమ్మకాలు మరింత పెరుగుతాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇది పెద్ద ముందడుగు అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఎండీ రాజన్ అంబ అన్నారు. "JLR మొదటిసారిగా బ్రిటన్ వెలుపల ఎక్కడో ఉత్పత్తిని ప్రారంభించబోతోంది. ధరలను తగ్గించడం ద్వారా, ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడంలో మేము ప్రయోజనం పొందుతాము. దాదాపు 54 ఏళ్లుగా రేంజ్ రోవర్ సిరీస్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భారత మార్కెట్ ఖరీదైన కార్లను ఎంత వేగంగా స్వీకరిస్తుందో తెలియజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో, JLR భారతదేశంలో 4,436 కార్లను విక్రయించింది" అని అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications