Trending Stock: యోగా గురువు రామ్‌దేవ్ కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాక పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. దేశంలో ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు ఇన్వెస్టర్లకు కాసులను కురిపిస్తోంది.

వేలకోట్ల వ్యాపారంగా రికార్డు:
రామ్‌దేవ్ బాబాకు చెందిన ఏకైక లిస్టెడ్ కంపెనీ పతంజలి ఫుడ్స్. ఈ స్టాక్ ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ రోజు కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.50,000 కోట్ల మార్కును అధిగమించి కొత్త రికార్డులను సృష్టించింది.

స్టాక్ పనితీరు
గత 5 ఏళ్లలో పతంజలి ఫుడ్స్ షేర్ ధర సుమారు రూ.21 నుంచి రూ.1,393 స్థాయికి పెరిగింది. ఇది దాదాపు 6,250 శాతం రాబడితో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. అదే విధంగా మూడేళ్లలో.. ఈ ఎఫ్‌ఎంసీజీ స్టాక్ BSEలో ఒక్కో షేరుకు రూ.3.54 స్థాయి నుంచి రూ.1,393కి పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో పెట్టుబడిదారులు 39,250 శాతం రిటర్న్ పొందారు.

ఇప్పుడు పరిస్థితి ఏమిటి
వారంలో మొదటి ట్రేడింగ్ రోజున పతంజలి ఫుడ్స్ స్టాక్ బీఎస్ఈలో రూ.1,415 స్థాయికి చేరుకుంది. ఇది 52 వారాల గరిష్ఠ ధర అని చెప్పుకోవాలి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రామ్‌దేవ్ బాబా కంపెనీ షేర్ ధర దాదాపు రూ.1,285 నుంచి రూ.1,415కి పెరిగింది. ఈ నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే పెట్టుబడిదారులు 10 శాతం కంటే ఎక్కువ రాబడిని పొందారు.

వంటనూనెల్లో రారాజుగా
వంట నూనెల దిగుమతి నుంచి భారతదేశానికి విముక్తి కల్పించటమే లక్ష్యంగా పతంజలి ఫుడ్స్ ముందుకు సాగుతోంది. దీనికోసం కంపెనీ సుమారు 1.5 మిలియన్ ఎకరాల భూమిలో పామాయిల్ చెట్లను నాటింది. రానున్న 40 సంవత్సరాల పాటు దేశీయ అవసరాలకోసం ఇవి పామాయిల్ ఉత్పత్తికి తోడ్పడతాయని కంపెనీ చెబుతోంది. దీని వల్ల కంపెనీ రానున్న కాలంలో మరింతగా లాభపడనుంది.

డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీ
పతంజలి ఫుడ్స్ స్టాక్ తన పెట్టుబడిదారులకు డివిడెండ్ ఇవ్వబోతోంది. కంపెనీ తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ.5 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీగా సెప్టెంబర్ 26, 2022ని నిర్ణయించింది. అంటే ఈ మల్టీబ్యాగర్ FMCG స్టాక్ 23 సెప్టెంబర్ 2022న ఎక్స్-డివిడెండ్ ట్రేడ్ చేయబోతోంది. ఈ సమయంలోపు స్టాక్స్ కలిగి ఉన్న వ్యక్తులకు కంపెనీ డివెడెండ్ చెల్లిస్తుంది.


Click it and Unblock the Notifications