Ramco Systems Share: చిన్న కంపెనీలు సైతం పెద్ద డీల్స్ చేసుకుంటూ చిచ్చరపిడుగుల్లా దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ షేర్లలో నేడు 20 శాతం పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆస్వాధిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇంట్రాడేలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న రామ్‌కో సిస్టమ్స్ కంపెనీ షేర్ల గురించే. ఇంట్రాడేలో రామ్‌కో సిస్టమ్స్ షేర్లు ఏకంగా 20 శాతం పెరిగి రూ. 341.75కి చేరాయి. అయితే కంపెనీ షేర్లు నిన్న క్లోజింగ్ సమయంలో రూ.284.80 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కంపెనీ షేర్ల మెగా ర్యాలీకి అసలు కారణం దక్షిణ కొరియాకు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ కొరియన్ ఎయిర్‌తో జరిగిన పెద్ద ఒప్పందమే. ప్రస్తుతం కంపెనీ షేర్లు దాని 52 వారాల గరిష్ఠ స్థాయి ధర రూ.356.65కు అతి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

కొరియన్ ఎయిర్‌తో మల్టీ మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ డీల్ కొరియన్ ఎయిర్ కొత్త ఇంజన్ మెయింటెనెన్స్ కాంప్లెక్స్‌లో సాంకేతిక మద్దతు కోసం. చికాగోలో రామ్‌కో సిస్టమ్స్, కొరియన్ ఎయిర్ అసోసియేషన్ మధ్య డీల్ అధికారికంగా ప్రకటించబడింది. కొరియన్ విమానయాన సంస్థ ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న అన్‌బాక్‌లో ఇంజన్ నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్(MRO) సదుపాయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగింది.
ఏడాది కాలంలో రామ్‌కో సిస్టమ్స్ షేర్లలో మంచి పెరుగుదల నమోదైంది. గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 53% మేర ర్యాలీ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల పరిశ్రమకు అనుబంధంగా ఉన్న రామ్‌కో సిస్టమ్స్ షేర్లు ఏప్రిల్ 10, 2023న రూ.224.45 వద్ద ఉన్నాయి. ఏప్రిల్ 10, 2024న కంపెనీ షేర్లు రూ.341.75కి పెరిగాయి. 2024 జనవరి 1, 2024న కంపెనీ షేర్లు రూ.295.05 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ.340 మార్కును దాటాయి. తాజా ర్యాలీ తర్వాత రామ్‌కో సిస్టమ్స్ మార్కెట్ క్యాప్ రూ.1,210 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications