హైదరాబాద్‌లో కేబుల్ వైర్లు ఎందుకు కట్ చేస్తున్నారు..రామంతాపూర్ ఘటనకు దీనికి లింకు ఏంటీ..

Ramanthapur Mishap: రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ మతపరమైన ఊరేగింపు సందర్భంగా విద్యుత్ షాక్ సంఘటన జరిగింది.రథానికి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడే ఐదుగురు యువకులు విద్యుత్‌ షాక్‌తో మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య అయిదు నుంచి ఆరుకు పెరిగింది.ఈ ఘటనపై విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. 11 కేవీ విద్యుత్ తీగకి ఇంటర్నెట్ కేబుల్ కండక్టర్ వైర్ కాంటాక్ట్‌లో ఉందని తెలిపారు. దీంతో ఇంటర్నెట్ కేబుల్లో కూడా కరెంట్ పాస్ అవుతోందని పేర్కొన్నారు. ఆ ఇంటర్నెట్ కేబుల్ శోభాయాత్రలోని రథానికి తాకి.. రథం మొత్తం కరెంట్ సరఫరా అయ్యిందని చెప్పారు.

ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. విద్యుత్‌ సంస్థ విద్యుత్ స్తంభాలకు వేలాడుతుండే తీగలపై తమ చర్యలను ముమ్మరం చేసింది.హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలకు వేలాడుతూ కనిపిస్తున్న స్టార్‌ కేబుళ్లు, టీవీ, ఇంటర్నెట్‌ ఫైబర్‌ కేబుళ్లని తొలగించే చర్యలు రెండు రోజుల నుంచి చేపడుతోంది. ఈ ఘటనపై సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Hyderabad broadband outage power utility cable cut COAI statement internet disruption Hyderabad fiber cables removal broadband users affected Hyderabad internet blackout telecom operators protest COAI p ver Ramanthapur electric shock incident Janmashtami procession in Hyderabad Hyderabad Ramanthapur Sri Krishnashtami chariot procession Gokulenagar Ramanthapur Mishap

COAI డైరెక్టర్ జనరల్ ఎస్. పి. కొచ్చర్ స్పందన: తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌ (TGSPDCL) హైదరారబాద్ నగర వ్యాప్తంగా విచక్షణారహితంగా ఫైబర్ కేబుళ్లను కత్తిరించడం వల్ల హైదరాబాద్‌ నగరంలో ఫైబర్-టు-హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ తీవ్రంగా ప్రభావితమైందని COAI పేర్కొంది. COAI డైరెక్టర్ జనరల్ ఎస్. పి. కొచ్చర్ మాట్లాడుతూ..ఈ రోజు నగరంలో పెద్ద సంఖ్యలో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు నెట్‌వర్క్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లను విచక్షణారహితంగా కత్తిరించినందున ఈ అంతరాయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు: విద్యుత్ స్తంభాల నుంచి ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలను తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించిన సంగతి విదితమే. ఆయన ఆదేశాల మేరకు TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, యుటిలిటీ అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేసి, రెండు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కేబుళ్ల తొలగింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు: అయితే ఈ చర్యలో టీవీ కేబుల్లతో పాటు ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను కూడా ఒకేసారి కత్తిరించడంతో వందల సంఖ్యలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు సమాచార సేవలు బంద్ అయ్యాయి. ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు, వర్క్ ఫంహోమ్ చేస్తున్న ఉద్యోగులు, ఆన్‌లైన్ క్లాసులపై ఆధారపడే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కేబుళ్లకు విద్యుత్తుతో ఎలాంటి సంబంధం లేదు: ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కేబుళ్లకు విద్యుత్తుతో ఎలాంటి సంబంధం లేదని COAI స్పష్టం చేసింది. వాటి ద్వారా విద్యుత్ పాకే అవకాశం ఉండదని, క్రమశిక్షణతో అమర్చిన ఆప్టికల్ ఫైబర్ లైన్లను కత్తిరించుకునే బదులు వాటిని గుర్తించి భద్రంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని COAI కోరింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఈ రోజుల్లో అత్యంత కీలకమైన సేవ. ఆప్టికల్ కేబుల్స్‌ను ఎప్పుడైనా కత్తిరించాల్సి వస్తే అది సమన్వయంతో, ముందస్తు నోటీసుతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జరగాలని తెలిపింది. ఇప్పుడు విచక్షణ లేకుండా తీసుకున్న చర్యల వల్ల ప్రజలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఎంతో మంది ఇంటర్నెట్ సేవలు కోల్పోయారని COAI తెలిపింది. ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేసి, ఇప్పటికే కత్తిరించిన కేబుల్స్‌ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని COAI డైరెక్టర్ జనరల్ కోరారు.

తీవ్రంగా స్పందించిన HRC : ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం (HRC) కూడా తీవ్రంగా స్పందించింది. సంఘటనకు సంబంధించిన కథనాలను పరిశీలించిన HRC స్వయంగా (సుమోటోగా) కేసును నమోదు చేసి, తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంఘటనకు కారణమైన పరిస్థితులు, సంబంధిత అధికారుల నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యం, వెంటనే తీసుకున్న చర్యలు, ఇంకా బాధిత కుటుంబాలకు అందించాల్సిన పరిహారం తదితర అంశాలపై సెప్టెంబర్ 22లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TGSPDCL చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

TGSPDCL launches special drive

రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా: విద్యుత్ షాక్ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రామంతాపూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విషాదకర ఘటనపై ప్రభుత్వం పూర్తిగా బాధిత కుటుంబాల పక్షాన నిలుస్తుందని, వారి బాధను తాము అర్థం చేసుకోగలమని తెలిపారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తామని, వారి చికిత్సా వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, భద్రత పరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సంబంధిత శాఖలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.

TGSPDCL launches special drive

బండ్లగూడ ప్రాంతంలో మరో విషాద ఘటన: మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట మండలంలోని బండ్లగూడ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో భాగంగా స్థానిక యువకులు 22 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని చంద్రాయణగుట్ట నుంచి పురానాపుల్ వైపు తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.విగ్రహం ఓ చోట విద్యుత్ తీగలకు తగలడంతో, ఆ తీగను కర్రతో పైకి ఎత్తి దూరం చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు యువకులు ముందుకు వెళ్లారు. అయితే కరెంట్ తీగను తాకే సమయంలో తీవ్రంగా విద్యుత్ షాక్ తగలి కుప్పకూలిపోయారు.ఈ దుర్ఘటనలో ధోని (21), వికాస్‌ (20) అనే యువకులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు ఉన్న మరింత ముగ్గురు యువకులు కూడా షాక్ తీవ్రతతో గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని ఒవైసీ ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అంబర్‌పేట ప్రాంతంలో మరో విషాదకర ఘటన: ఇక అంబర్‌పేట ప్రాంతంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపానికి పందిరి వేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు మార్గాన్ని అడ్డుకోవడంతో, స్థానికులు కట్టె ఉపయోగించి వాటిని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియలో రామ్‌ చరణ్ అనే యువకుడికి కరెంట్ షాక్ తగిలింది. షాకుతో కింద పడిపోయిన అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

2 రోజుల్లో మూడు విద్యుత్ షాక్ ప్రమాదాలు: రెండురోజుల వ్యవధిలో హైదరాబాద్ నగరంలో మూడు విద్యుత్ షాక్ ప్రమాదాలు చోటుచేసుకుని, మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వరుసగా జరిగిన ఈ ఘటనలు నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లకు, విద్యుత్ స్తంభాలకు లేదా విద్యుత్ తీగలకు సమీపంలోకి వెళ్లకూడదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+