రామ్ మందిర్ వివాదంతో ఆలయాల నిర్వహణపై చర్చ.. తిరుమల నుంచి వైష్ణోదేవి వరకు ఎవరు నిర్వహిస్తున్నారు..

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల రూపంలో వచ్చిన సుమారు రూ. 7 నుండి 7.5 కోట్ల నగదు, విలువైన లోహాలను ఆలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు కలిసి దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన సభ్యులైన చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేశారు.ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఈ రాజీనామాలు ఆమోదం పొందడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైనప్పటికీ, ఒకవేళ ఆమోదించబడినా వారు కేవలం బాధ్యతల నుండి మాత్రమే తప్పుకుంటారు కానీ ట్రస్ట్‌లో జీవితకాల సభ్యులుగా కొనసాగుతారు.

ఈ లూటీ వ్యవహారం బయటపడటానికి ప్రధాన కారణం అక్కడ నిబంధనల లోపమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గుర్తించింది. రామ మందిరంలోని 40 విరాళాల పెట్టెల నుండి వచ్చిన నగదును లెక్కించే బాధ్యతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి అప్పగించినప్పటికీ, ఆ లెక్కింపు బృందంలో ఎస్బీఐ సిబ్బందితో పాటు వారణాసికి చెందిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఉద్యోగులు , కొందరు ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. అయితే, లెక్కింపు సమయంలో సిబ్బంది జేబులు లేని దుస్తులు ధరించాలనే నిబంధన పెట్టకపోవడం, పర్యవేక్షణకు ఎలాంటి ప్రభుత్వ అధికారులను నియమించకపోవడం , సిబ్బందిని తనిఖీ చేసే బాధ్యతను కూడా ఒక ప్రైవేట్ సంస్థకే అప్పగించడం వంటి లోపాల వల్లే ఈ భారీ దొంగతనం జరిగిందని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.

Ram Mandir donation row temple management India Ram Mandir trust temple administration Tirumala Tirupati Devasthanams TTD Vaishno Devi Shrine Board Shree Jagannath Temple Guruvayur Devaswom Siddhivinayak Temple Trust Kashi Vishwanath Somnath Trust state-wise temple management temple governance Hindu temples temple trusts Devaswom Board religious institutions India news temple administration rules

ఈ వివాదం భారతదేశంలో ఉన్న సుమారు 10 లక్షలకు పైగా దేవాలయాల నిర్వహణ, భద్రత , వాటి ఆడిటింగ్ ప్రక్రియలపై ఒక విస్తృతమైన చర్చకు దారితీసింది. దేశంలో ఆలయాల పరిపాలన ప్రధానంగా మూడు సాంప్రదాయ వ్యవస్థల ద్వారా సాగుతోంది. మొదటిది వంశపారంపర్య పురోహిత కుటుంబాల పర్యవేక్షణలో సాగే 'కుటుంబ నిర్వహణ పద్ధతి', దీనికి బృందావన్‌లోని బాంకే బిహారీ దేవాలయం ఒక ఉదాహరణ. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నప్పుడు వంతులవారీగా బాధ్యతలు పంచుకుంటారు.

Also Read

రెండవది ఒకే ఒక ఆధ్యాత్మిక అధిపతి ఆధీనంలో సాగే 'మహంత్ వ్యవస్థ'. గోరఖ్‌నాథ్ ఆలయం లేదా హనుమాన్ గర్హి వంటి చోట్ల ఆలయ పరిపాలన, ఆస్తులు , వారసుడిని నియమించే సంపూర్ణ అధికారం మహంత్ లేదా పీఠాధీశ్వరులకే ఉంటుంది. ఇక మూడవది సాధువులు, సన్యాసుల సామూహిక సంస్థల ద్వారా సాగే 'అఖాడా లేదా పంచాయతీ వ్యవస్థ'. మహాకుంభ్ వంటి ఉత్సవాలలో కీలక పాత్ర పోషించే ఈ అఖాడాలు 13 రకాలుగా ఉండి శైవ, వైష్ణవ, ఉదాసీన సంప్రదాయాలుగా పనిచేస్తాయి.

స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2) ప్రకారం మతపరమైన సంస్థల ఆర్థిక, ద్రవ్య , లౌకిక కార్యకలాపాలను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు లభించింది. దీనివల్ల వివిధ రాష్ట్రాలు తమ సొంత చట్టాల ద్వారా దేవాలయాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డును, కేరళలో శబరిమలను పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును, తమిళనాడులో 40 వేలకు పైగా ఆలయాలను చూసే హిందూ మత ధార్మిక దానాల శాఖను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం, ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం, కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ప్రభుత్వాలు నియమించిన అధికారులు లేదా కమిటీల పర్యవేక్షణలోనే నడుస్తున్నాయి.

అయితే ముస్లిం, క్రైస్తవ వర్గాల ప్రార్థనా స్థలాలు వారి స్వంత బోర్డుల ద్వారా నిర్వహించబడుతుండగా, హిందూ దేవాలయాల ఆదాయాన్ని కొన్నిసార్లు చిన్న ఆలయాల నిర్వహణకు కూడా ప్రభుత్వాలు ఉపయోగిస్తాయి. భారతదేశంలో దేవాలయాల ఆడిటింగ్‌కు నిర్దిష్టమైన ఏకరూప చట్టం లేదు; ప్రభుత్వ ఆధీనంలోని బోర్డులను ప్రభుత్వ ఆడిటర్లు తనిఖీ చేస్తే, రామ మందిరం వంటి స్వతంత్ర ప్రజా ట్రస్టులు లేదా కుటుంబాల ఆధీనంలోని ఆలయాలు ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ల (CA) ద్వారా వార్షిక ఆడిట్ నిర్వహిస్తాయి.

సాధారణంగా దేశంలోని ప్రముఖ ఆలయాలు భక్తులు ఇచ్చే కానుకల రక్షణ కోసం అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలను , పారదర్శకమైన 'హుండీ లెక్కింపు విధానాలను' అమలు చేస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తన 'పారకమణి' ప్రక్రియ ద్వారా శాశ్వత ఆర్థిక సిబ్బంది, బ్యాంకు ప్రతినిధులు , పదవీ విరమణ చేసిన ప్రభుత్వ అధికారుల సమక్షంలో నిరంతరం సీసీటీవీల నిఘాలో విరాళాలను లెక్కిస్తుంది. పూరీ జగన్నాథ ఆలయంలో కమిటీ సభ్యుల సమక్షంలో గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో హుండీలు తెరిచి లెక్కిస్తారు, అలాగే ఇక్కడ డిజిటల్ విరాళాల సౌకర్యం కూడా ఉంది. వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో ఆర్థిక, పరిపాలనా, భద్రతా అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీలు ఈ పనిని నిర్వహిస్తాయి.

ముంబై సిద్ధివినాయక ఆలయంలో ప్రతి వారం ట్రస్టీలు, ఆడిటర్లు, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో హుండీలు తెరిస్తే, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయంలోని 56 విరాళాల పెట్టెలను వారానికి రెండుసార్లు ఏకంగా ఒక సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ప్రత్యక్ష పర్యవేక్షణలో తెరిచి లెక్కిస్తారు. అయోధ్య రామ మందిరంలో జరిగిన ఈ భారీ విరాళాల కుంభకోణం, భవిష్యత్తులో ఇలాంటి పవిత్ర స్థలాలలో కూడా ఇటువంటి లోపాలు లేకుండా ఇతర ప్రముఖ ఆలయాల తరహాలోనే పటిష్టమైన ప్రభుత్వ పర్యవేక్షణ, కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+