Trending Stock: దేశంలోని ప్రజలేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముని భక్తులు ఎదురుచూస్తున్న కార్యక్రమం మరో రెండు రోజుల్లో జరగబోతోంది. అదే అయోధ్య ఆలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ. దీనికి సంబంధించిన అనేక కంపెనీల షేర్లు ఇప్పటికే భారీగా పెరుగుదలను నమోదు చేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పక్కా లిమిటెడ్ స్టాక్ గురించే. అయోధ్యకు చెందిన ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం మార్కెట్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. ఇప్పటికే సంస్థ రామ్ మందిర్ ట్రస్ట్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం. గురువారం కంపెనీ షేర్లు మార్కెట్లో 12 శాతం మేర లాభపడి రూ.323.75 వద్ద స్థిరపడ్డాయి. అలాగే ఇంట్రాడేలో గరిష్ఠ ధర రూ.334.40ను తాకింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ తన షేర్ హోల్డర్లకు 250 శాతానికి పైగా రాబడిని అందించింది.

వాస్తవానికి కంపెనీ పర్యావరణ హితమైన ప్లేట్లను తయారుచేసే వ్యాపారంలో ఉంది. ప్రస్తుతం శ్రీరాముని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంస్థ తయారు చేసిన ఎకో-ఫ్రెండ్లీ ఫుడ్ ప్లేట్లలో భక్తులకు ప్రసాదం అందించాలని ఆలయ బోర్డు నిర్ణయించింది. దీనిపై కంపెనీ ఇండియా బిజినెస్ హెడ్ హెడ్ జగ్‌దీప్ హీరా మాట్లాడుతూ.. కంపోస్టబుల్ టేబుల్‌వేర్‌కు ప్రసిద్ధి చెందిన తమ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ CHUKను రామ్ మందిర్ ట్రస్ట్ ఎంపిక చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ తమ ఉత్పత్తులను చెరకు పిప్పి నుంచి పర్యావరణ హితంగా తయారు చేస్తోంది.
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు రానున్నారు. రామమందిర్ ట్రస్ట్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా ఆలయానికి కంపోస్టబుల్ టేబుల్‌వేర్‌ను అందజేస్తామని హీరా వెల్లడించారు. 2023 జనవరి 19న పక్కా లిమిటెడ్ స్టాక్ ధర కేవలం రూ.92.80గా ఉంది. కానీ నిన్నటి ధరను పరిశీలిస్తే 250 శాతం మేర పెరిగి రూ.323.75 వద్ద కొనసాగుతోంది.
గడచిన నాలుగేళ్ల కాలంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు ఏకంగా 1507 శాతానికి పైగా రాబడిని అందించింది. అవును 2020 ఏప్రిల్ 3న స్టాక్ ధర కేవలం రూ.20.15 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో ఉన్న అనేక ఇతర కంపెనీలు సైతం ఇదే తరహాలో లాభాలను తమ పెట్టుబడిదారులకు అందిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications