Sensex@ 75k:సంచలనంగా సెన్సెక్స్ ర్యాలీ.. చప్పగా బ్యాంకింగ్ స్టాక్స్ ప్రయాణం..
Stock Market: నేడు బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నిన్నటి ర్యాలీని కొనసాగించింది. స్టాక్ మార్కెట్ల ప్రారంభంలోనే సెన్సెక్స్ సూచీ 75000 మార్కును అధిగమించి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిని చేరుకుంది.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 34 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 76 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 83 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ ఇంట్రాడే హై 75,124.28 పాయింట్లను తాకింది.

ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, విప్రో, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, నెస్లే, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలతో టాప్ గెయనర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, రిలయన్స్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్, టైటాన్, టాటా కన్జూమర్, ఎల్ టి, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, మారుతీ, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications