మార్కెట్లో దుమ్మురేపుతున్న ఆపరేషన్ సిందూర్ రాఖీలు, ఏకంగా రూ. 21 వేల కోట్ల బిజినెస్..

Raksha Bandhan Sales: దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకల సందడి షురూ అయింది.ఆగస్టు 9న రాఖీ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోనున్నారు. మార్కెట్లలో రాఖీకు పుల్లుగా డిమాండ్ ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా ప్రకారం..ఈ సంవత్సరం రాఖీ మార్కెట్ బిజినెస్ మొత్తం రూ. 21 వేల కోట్లను తాకనుంది. ఇందులో రూ. 17 వేల కోట్లవ్యాపారం రాఖీల అమ్మకం ద్వారా, మరో రూ. 4 వేల కోట్ల విలువైన వ్యాపారం స్వీట్లు, పండ్లు, బహుమతులతో పాటు ఇతర పండుగ వస్తువుల ద్వారా జరగనుందని అంచనా వేసింది.

దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్ వంటి ప్రముఖ మార్కెట్లలో రద్దీ విపరీతంగా నెలకొంది. పది రూపాయల నుండి వేల రూపాయల వరకు రాఖీలు షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాలతో చేసిన ప్రత్యేక రాఖీలు లగ్జరీ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక కొన్ని షాపుల వాళ్లు అయితే సంవత్సరమంతా ధరించగలిగేలా బ్రాస్లెట్‌లా డిజైన్ చేసిన రాఖీలను విక్రయిస్తున్నారు.

ఈ ఏడాది రాఖీని ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. భారత సాయుధ దళాల 'ఆపరేషన్ సిందూర్' విజయోత్సవంతో రాఖీ పండగ ఈ సారి ఉత్సాహంగా మారింది. మార్కెట్లలో త్రివర్ణ పతాక రంగుల రాఖీలు అలాగే జాతీయవాదం ఉట్టిపడే రాఖీలు కొనుగోలుదారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.పలు నగరాల్లో రాఖీ స్టాళ్లు సాంప్రదాయ రుద్రాక్ష, పూసల రాఖీల నుండి కార్టూన్ పాత్రలు, వ్యక్తిగత పేర్లు, పర్యావరణ హితమైన డిజైన్ల వరకు విభిన్న రకాలతో నిండిపోయాయి. మార్కెట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సరిపడే రాఖీలు అందుబాటులో ఉన్నాయి.

Rakhi 2025 market Raksha Bandhan sales 21 000 crore rakhi market designer rakhi trends luxury rakhi 2025 rakhi shopping India rakhi gifts 2025 festive season sales India rakhi business growth Raksha Bandhan economy 2025 21 000 2025 2025 2025 Operation Sindoor Rakhi

CAIT సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రకారం, ఈ సంవత్సరం మార్కెట్‌లో వినూత్న రాఖీలు హాట్ టాపిక్ గా మారాయి. 'వోకల్ ఫర్ లోకల్', QR కోడ్‌లతో కూడిన 'డిజిటల్ రాఖీలు', అలాగే ఆపరేషన్ సిందూర్, మోడీ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్, జై హింద్, విక్షిత్ భారత్ వంటి థీమ్ ఆధారిత డిజైన్లు విపరీతంగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. వీటిలో చాలావరకు స్థానిక మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, శిల్పులు చేతితో తయారు చేస్తున్నారన్నారు. దీని ద్వారా మహిళా సాధికారత, స్థానిక పరిశ్రమలకు ఊతం లభిస్తోందని తెలిపారు.

ఇక సూరత్‌లో బంగారం, వెండి, వజ్రాలతో చేసిన రాఖీలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఈ రాఖీ ధరలు రూ. 5 వేల నుండి రూ. 5 లక్షల వరకు ఉన్నాయి. ఇవి కేవలం పండుగ కోసం మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా రాఖీ ప్రియులు కొనుగోలు చేస్తున్నారు. సోదరీమణులు తమ సోదరుల కోసం దీర్ఘకాలం ధరించగలిగేలా ప్రత్యేక డిజైన్ రాఖీలను ఎంచుకుంటున్నారు. రక్షా బంధన్ కేవలం అలంకారపు ఉత్సవంగానే కాకుండా అన్న, చెల్లి, అక్క, తమ్ముడు మధ్య ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తోంది. కాబట్టి ఈ బంధం ఉట్టిపడేలా మార్కెట్లో రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

వినూత్నమైన రాఖీలు మార్కెట్లో హిట్: ఈసారి రాఖీలలో 'వోకల్ ఫర్ లోకల్' నుండి 'డిజిటల్ రాఖీ' వరకు అమ్మకాలకు సిద్ధమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ నుండి మోడీ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీ, జై హింద్ రాఖీ, భారత్ మాతా కీ జై, వికాసిత్ భారత్, వందేమాతరం వంటి పేర్లతో రాఖీలు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. దీనితో పాటు ఇతర ఆకర్షణీయమైన రాఖీలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ నెలకొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+