Titan Q4 Results: దేశంలో ప్రముఖ ఇన్వెస్టర్ దివంగత బిగ్ బుల్ ఎంతగానో ఇష్టపడే స్టాక్ టైటాన్ కంపెనీ. ఆయనకు అనేకరెట్లు సంపదను తెచ్చిపెట్టిన కంపెనీ తాజాగా తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టైటాన్ కంపెనీ నికర లాభం 7 శాతం పెరిగి రూ.786 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.734 కోట్లుగా ఉంది. అలాగే కంపెనీ ఆదాయం గత ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.8,553 కోట్లతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.10,047 కోట్లుగా నమోదైంది. అయితే ఈబిఐడిటిఏ నాలుగో త్రైమాసికంలో 6.2 శాతం పెరిగి రూ.1,109 కోట్లుగా నివేదించబడింది.

తాజా ఫలితాల వెలువడి సమయంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.11 చొప్పున డివిడెండ్ అందించాలని నిర్ణయించింది. అయితే దీనికి కంపెనీ 40వ వార్షిక జనరల్ మీటింగ్ సమయంలో కంపెనీ షేర్ హోల్డర్ల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత చెల్లించాలని నిర్ణయించింది. అయితే నేడు టైటాన్ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 1.50 శాతం క్షీణించి రూ.3,514.75 వద్ద ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో కంపెనీ బంగారు ఆభరణాల వ్యాపారం ఏడాది ప్రాతిపదికన 19 శాతం వృద్ధి చెంది అమ్మకాలు రూ.8,998 కోట్లుగా ఉన్నట్లు క్యూ4లో ప్రకటించింది. అలాగే తనిష్క్ కొత్తగా దుబాయ్, చికాగో, యూఎస్ఏలో కొత్త స్టోర్లను ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా స్టోర్ల సంఖ్యను 16కి పెంచుకుంది.
కంపెనీ వార్షిక పనితీరును పరిశీలిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.47,501 కోట్లుగా ఉంది. FY23 నుంచి సంవత్సరానికి వృద్ధి 23%గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుకు ముందు లాభం రూ.4,623 కోట్లకు చేరుకోగా.. ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,447 కోట్ల కంటే 4 శాతం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆభరణాల వ్యాపార విభాగం ఆదాయం రూ.38,353 కోట్లుగా నమోదైంది. ఇది అంతకు ముందు ఏడాది కంటే 20 శాతం అధికం కావటం గమనార్హం. అలాగే పూర్తి సంవత్సరానికి వాచీలు & వియరబుల్స్ విభాగం మొత్తం ఆదాయం 18% వృద్ధితో రూ.3,904 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications