వాటర్ ట్రీట్‌మెంట్ కంపెనీ వా టెక్ వాబగ్ షేర్లు ఉదయం 10 శాతానికి పైగా లాభపడి రూ.330ని తాకింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి రూ.24 లేదా 8.16 శాతం లాభపడి రూ.320 వద్ద ముగిసింది. గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ నోమురా ఈ స్టాక్ టార్గెట్ ధరను పెంచింది. దీంతో వా టెక్ వాబగ్ షేర్ పరుగు పెడుతోంది. ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, అతని సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు డిసెంబర్ 31, 2021 నాటికి ఇందులో 8.04 శాతం వాటాలు లేదా 50 లక్షల ఈక్విటీ షేర్లు ఉన్నాయి.
వాటర్ ట్రీట్మెంట్ సెక్టార్‌లో లీడింగ్ కంపెనీగా ఉంది. హెల్తీ ఆపరేషనల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎబిటా మార్జిన్ వృద్ధిలో ఉంది. కంపెనీ మార్జిన్ 10 శాతం, బలమైన రుణ తగ్గింపుతో ఉందని, ఇవి కీలక సానుకూల అంశాల్లో ఒకటి అని నోమురా పేర్కొంది. నోమురా ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.634కు పెంచింది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది 95 శాతం అధికం.

డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికాలంలో ఈ స్మాల్ క్యాప్ కంపెనీ కన్సాలిడేటెడ్ ఎబిటా ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం పెరిగి రూ.78.7కు చేరుకుంది. మార్జిన్స్ 180 బేసిస్ పాయింట్లు పెరిగి 10.6 శాతంగా ఉంది. పారిశ్రామిక, అంతర్జాతీయ ఆర్డర్లు, ఈ కంపెనీ వేగం, మెరుగైన ఆపరేటింగ్ మార్జిన్స్‌కు దారి తీసిందని చెబుతోంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications