సాధారణంగా మార్కెట్ నిష్ణాతులు, నిత్యం మార్కెట్‌లో ఉండేవారు డబ్బులు కోల్పోరని చాలామంది భావించి ఉంటారు. ఇది అపోహగానే చెప్పవచ్చు. వారు కూడా డబ్బును కోల్పోతారు. ఇక, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయనను భారత వారెన్ బఫెట్‌గా పిలుస్తారు. ఆయన ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారని చూసి, మరీ ఇన్వెస్ట్ చేసే వారు ఉంటారు. ఆయనకు టైటాన్, స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. ఈ రెండు స్టాక్స్ శుక్రవారం పడిపోయిన తర్వాత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెద్ద ఎత్తున సంపదను కోల్పోయారు. యూఎస్ ద్రవ్యోల్భణం పెరుగుదల తర్వాత పడిపోతున్న మార్కెట్ మధ్య, టైటాన్ కంపెనీ షేర్ ధర శుక్రవారం రూ.53కు పైగా క్షీణించింది. స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ షేర్ ధర ఒక్కో షేరుకు రూ.18.55 తగ్గింది.
టైటాన్ కంపెనీలో రాకేష్‌కు, ఆయన సతీమణి రేఖకు పెద్ద ఎత్తున షేర్లు ఉన్నాయి. రాకేష్‌కు 4.02 శాతం, రేఖకు 1.07 శాతం షేర్లు ఉన్నాయి. అంటే ఈ కంపెనీలో వీరి మొత్తం షేర్ల వ్యాల్యూ 5.09 శాతం లేదా రూ.4.52 కోట్లుగా ఉంది. టైటాన్ కంపెనీ షేర్ ధర రూ.53.20 పడిపోవడంతో ఈ దంపతుల సంపద రూ.240 కోట్లు హరించుకుపోయింది.

స్టార్ హెల్త్ ఇన్సురెన్స్‌లో రాకేష్, రేఖల షేర్ల వాటా వ్యాల్యూ 17.50 శాతం. 10 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో స్టార్ హెల్త్ షేర్ ధర రూ.18.55 తగ్గింది. దీంతో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నికర సంపద రూ.186 కోట్లు తగ్గింది. రెండు కంపెనీల ద్వారా శుక్రవారం ఒక్కరోజే ఆయన రూ.426 కోట్లు నష్టపోయారు.
More From GoodReturns

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications