Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా మన మధ్య లేనప్పటికీ.. ఆయన పోర్ట్ ఫోలియో స్టాక్ దూకుడు కొనసాగిస్తున్నాయి. టాటా గ్రూప్ కు చెందిన హోటల్ చైన్ స్టాక్ ఇప్పటికే ఇన్వెస్టర్ల పెట్టుబడులను డబుల్ చేశాయి. రానున్న కాలంలో ఈ దూకుడు కొనసాగుతుందని బ్రోకరేజ్, రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి.

దూసుకెళ్తున్న స్టాక్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇండియన్ హోటల్స్(IHCL) షేర్ల గురించే. ఈ స్టాక్ ఏడాది కాలంలో 100 శాతానికి పైగా పెరిగింది. ఈ రోజు ఇండియన్ హోటల్స్ షేర్లు రికార్డు స్థాయిలో రూ.318.15కి చేరాయి. దీంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.45,403 కోట్లకు పెరిగింది. గతంలో సెప్టెంబర్ 20, 2021న షేరు ధర 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.143.41 వద్ద ఉండేది.

జున్‌జున్‌వాలా ఫ్యామిలీ పెట్టుడులు..
దివంగత ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా గత త్రైమాసికంలో ఇండియన్ హోటల్స్‌లో 3 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. వీటి వల్ల కంపెనీలో వారికి 2.12 శాతం వాటా ఉంది. కరోనా తర్వాత కంపెనీ ఆదాయాలు పెరగటం, దూకుడు విస్తరణ ప్రణాళికల కారణంగా ఇన్వెస్టర్లు మంచి రాబడులను పొందారు.

కంపెనీ లాభాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో.. ఆక్యుపెన్సీ, రేట్లు ప్రీ-కొవిడ్ స్థాయిలను మించిపోవడంతో డిమాండ్ పెరగడం కంపెనీకి కలిసొచ్చింది. పన్నుల తర్వాత ఆదాయం రూ.170 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ నివేదించింది. ఈ కాలంలో ఆదాయం 249.45 శాతం పెరిగి రూ.1,293 కోట్లకు చేరుకుంది.

బ్రోకరేజీల టార్గెట్..
యాక్సిస్ సెక్యూరిటీస్ కూడా హాస్పిటాలిటీ సంస్థపై బుల్లిష్‌గా ఉంది. ఇండియన్ హోటల్స్ షేర్ టార్కెట్ ధరను యాక్సిస్ రూ.360గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత స్థాయిల కంటే 16 శాతం పెరుగుదల. ఇదే సమయంలో.. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ UBS కూడా షేరుకు BUY రేటింగ్ ఇచ్చింది. కంపెనీ షేర్లకు రూ.375 టార్గెట్ ధరగా నిర్ణయించింది.

కంపెనీ వ్యాపారం..
ఇండియన్ హోటల్స్ ప్రస్తుతం 242 హోటళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో 63 ప్రపంచవ్యాప్తంగా 4 ఖండాలు, 11 దేశాలు, 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో అభివృద్ధి చెందుతోంది. దీని పైప్‌లైన్‌లో 60 ప్లస్ హోటళ్లు ఉన్నాయి. ఇందులో బ్రాండ్‌లలో 7,500 ప్లస్ గదులు ఉన్నాయి. ఇది FY25/26 నాటికి లాభదాయక వృద్ధికి రోడ్‌మ్యాప్‌గా 'AHVAAN 2025' అనే కొత్త వ్యూహాన్ని కంపెనీ రూపొందించింది.


Click it and Unblock the Notifications